పంచాంగం.. నేటి విశేషం.

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌹పంచాంగం🌹
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 01 – 09 – 2023,
వారం … భృగువాసరే ( శుక్రవారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – బహళ పక్షం,

తిథి : విదియ తె3.21 వరకు,
నక్షత్రం : పూర్వాభాద్ర సా6.48 వరకు,
యోగం : ధృతి సా5.40 వరకు,
కరణం : తైతుల సా6.30 వరకు,
తదుపరి గరజి తె3.21 వరకు,

వర్జ్యం : తె3.49 – 5.20,
దుర్ముహూర్తము : ఉ8.17 – 9.07 &
మ12.25 – 1.15,
అమృతకాలం : ఉ11.19 – 12.49,
రాహుకాలం : ఉ10.30 – 12.00,
యమగండo : మ3.00 – 4.30,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : కుంభం,
సూర్యోదయం : 5.48,
సూర్యాస్తమయం: 6.13,

*_నేటి విశేషం_*

*మూడవ శ్రావణ శుక్రవారం*

*మూడవ శ్రావణ శుక్రవారం!!! … ఏం చేయాలి???*
ఆదిశక్తి స్వరూపిణి అయిన లక్ష్మీదేవి అంశలుగా స్త్రీలందరూ భావింపబడడం సనాతన భారతీయ సంప్రదాయ విశేషం.
ఆ కారణంగానే మహిళలకు సౌభాగ్యప్రదమై మహిళా ప్రాధాన్యం సంతరిచుకున్న మాసం శ్రావణం…

జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషంగా సాగాలంటే లక్ష్మీకటాక్షం ఉండాలి.
లక్ష్మీదేవి విశేష అనుగ్రహం పొందాలంటే ప్రతి మంగళ, శుక్ర వారాలలో లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి…
ముఖ్యంగా శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు, శ్రావణ శుక్రవారం మహిళలు అమ్మవారిని పూజించడం వల్ల సౌభాగ్యం, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
శ్రావణ శుక్రవారం రోజు అమ్మవారికి వరలక్ష్మీ వ్రత పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పిస్తే భోగభాగ్యాలు కలుగుతాయి.
ముత్తైదువులను పిలిచి, తరతమభేదాలు విడిచి ప్రతి స్త్రీమూర్తిలోనూ లక్ష్మీదేవిని దర్శించి, ఇంటికి ఆహ్వానించి తాంబూలం సమర్పించాలి…
శ్రావణ శుక్రవారం నాడు లక్ష్మీదేవి అష్టోత్తరం, లలితా సహస్రనామాలు మనస్పూర్తిగా చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు.
శ్రావణ శుక్రవారం ఆలయ దర్శనం చేసుకుంటే అమ్మవారి అభయం పొందుతారు…
శుక్రవారం రోజు అమ్మవారికి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన సుమంగళి ప్రాప్తిస్తుంది, అమ్మవారిని ప్రతి మంగళ, శుక్రవారాలలో తెల్లటి పూలతో పూజించడం వలన మనం ఎంతో ప్రశాంతంగా ఆనందంగా ఉంటాము…
లక్ష్మీదేవికి తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది మంది ముత్తైదువులకు ఇంటి గృహిణి ద్వారా పసుపు, కుంకుమ, చందనం, ఎరుపురంగు జాకెట్ ముక్క, దక్షిణ కానుకగా ఇవ్వాలి.
ఇలా చేయడం వల్ల అనుకున్న పనులు విజయవంతమై మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి…

ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి “శ్రీ వరలక్ష్మీ” రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి.
కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.
ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమ (వీలైతే వెండిది)ను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి.
పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి.
పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి.

ఇకపోతే…. ఈ శ్రావణ శుక్రవారం
సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి.
నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి.
శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, “ఓం మహాలక్ష్మీదేవ్యై నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి…
వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి…

పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి.
ఈ పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే ఎంతో పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు.

ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది…
శుక్రవారం పూటే వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి,
ఆ రోజున స్త్రీలు వరలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం….

*_🌹శుభమస్తు🌹_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏