నేటి పంచాంగం…

ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
☀️పంచాంగం☀️
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 10 – 09 – 2023,
వారం … భానువాసరే ( ఆదివారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – బహళ పక్షం,

తిథి : ఏకాదశి రా10.25 వరకు,
నక్షత్రం : పునర్వసు రా7.18 వరకు,
యోగం : వరీయాన్ రా2.18 వరకు,
కరణం : బవ ఉ9.46 వరకు
తదుపరి బాలువ రా10.25 వరకు,

వర్జ్యం : ఉ6.22 – 8.06 &
తె4.02 – 5.47,
దుర్ముహూర్తము : ఉ4.26 – 5.15,
అమృతకాలం : సా4.43 – 6.26,
రాహుకాలం : సా4.30 – 6.00,
యమగండo : మ12.00 – 1.30,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : మిథునం,
సూర్యోదయం : 5.50,
సూర్యాస్తమయం: 6.05,

*_నేటి మాట_*

*భగవంతునికి ప్రీతిపాత్రులు ఎవరు???*

ఆధ్యాత్మిక సాధనకు శరణాగతి చాలా ముఖ్యం.
ఇది మనిషిలోని చింతలన్నింటినీ ఏరిపారేసి మనస్సును, బుద్ధిని భగవంతుని యందు స్థిర పరుస్తుంది…
” ఓ భగవంతుడా!!… కష్టమెుచ్చినా సుఖమెుచ్చినా అంతా మీ ఇష్టం, ఈ శరీరం మీది, ఈ ప్రాణం మీది, ఈ జీవితం కూడా మీదే, నాపై సర్వాధికారాలు మీవే”.

నేను నీ వాడను, నీవు నా వాడవు.
నాకు నీవు తప్ప వేరే ఆధారం ఏదియూ లేదు.
నేను మిమ్ములను తప్ప వేరే దేనినీ ఆశ్రయించను.
ఈ జీవితాన్ని మీకు అప్పగించు చున్నాను.
“దీనిని మీ ఇష్టం వచ్చిన రీతిగా నడిపించుకొండి” అని భగవంతునికి మెురపెట్టుకుంటూ మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవాలి.

ఫలితం ఏదైనప్పటికీ భగవత్ప్రసాదంగా స్వీకరించాలి.
ఇదే నిజమైన శరణాగతి, ఇట్టివాడు భగవంతునకు అత్యంత ప్రియమైనవాడు…
వీరు పొందలేనిది అంటూ ఏదీ ఉండదు…

🙏సర్వేజనాః సుఖినోభవంతు:🙏

🌸*శుభోదయం 🌸
——————-
🌻 *మహానీయుని మాట*🌻
————————-
“ఏ సౌకర్యాలు లేని మొక్క కూడా అందమైన పూవులతో ఆదర్శమైనట్లు
సంకల్పం నీ తోడుంటే సాధ్యం కానిది ఏదీ లేదు.”
————————–
🌹 *నేటీ మంచి మాట* 🌹
—————————
“మనం సంతోషంగా బ్రతకాలంటే
ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారో
అని ఆలోచించడం మానేయాలి.