నేటి పంచాంగం..

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🍁పంచాంగం🍁
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 24 – 08 – 2023,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం,
దక్షిణాయనం – వర్ష ఋతువు,
నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం,

తిథి : అష్టమి రా9.29 వరకు,
నక్షత్రం : అనూరాధ తె5.01 వరకు,
యోగం : ఐంద్రం సా5.45 వరకు,
కరణం : విష్ఠి ఉ9.47 వరకు
తదుపరి బవ రా9.29 వరకు,

వర్జ్యం : ఉ9.03 – 10.39,
దుర్ముహూర్తము : ఉ9.57 – 10.47 &
మ2.57 – 3.47,

అమృతకాలం : సా6.38 – 8.14,
రాహుకాలం : మ12.00 – 1.30,
యమగండo : ఉ7.30 – 9.00,
సూర్యరాశి : సింహం,
చంద్రరాశి : తుల,
సూర్యోదయం : 5.47,
సూర్యాస్తమయం: 6.18,

*_నేటి మాట_*

*భగవద్ అనుగ్రహం – పొందాలంటే???*

ఈరోజుల్లో మనందరికీ తెలిసినది ఏమంటే, పూజలు, నోములు, వ్రతాలు, చేస్తే భగవద్ అనుగ్రహం పొందవచ్చు అని, అలా అయితే అందరం జీవన్ముక్తులమైనట్లే…

సముద్రంనుండి నీరు వేడిమికి ఆవిరై పైకిపోవుటచేత మేఘములు ఏర్పడి వర్షాలు పడి పంటలు పండుచున్నాయి…

నీరే పైకి ఆవిరి కాకున్నా వర్షాలు పడే అవకాశం లేదు,
అలాగే మనం చేసే ప్రార్థనలు పైకి చేరితేనే భగవంతుని ఆశిస్సులు కిందికి రాగలవు…

భగవంతుడున్నాడనే స్పృహ లేకుండా నిత్యం తీరిక లేని వారివలే, సంసార సాగరంలో, మునిగి ఉంటూంటే ఇంకా, భగవద్ అనుగ్రహం ఎక్కడి నుండి వస్తుంది?…

సరైన సాధన చేయకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కూర్చుంటే వచ్చేవి చింతలే తప్ప ఇంకేమీ రావు…

నిత్యం సాధన చేయాలి, భగవంతుడిని అనుభవించాలి, ఏది జరిగినా ఆయన దయ అన్న భావం వుండాలి, అపుడే భగవదనుగ్రహం కలుగుతుంది…
లేదా …
మనకు part time devotion, వుంటే ఆయన కూడా part time grace వుంటుంది …

*_🍁శుభమస్తు🍁_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏