రాశి ఫలితాలు..

(03-01-2023) రాశి ఫలితాలు..

*మేషం*

నూతన విద్యవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. గృహ నిర్మాణ ఆటంకాలు తొలగుతాయి . ఆర్ధికంగా అభివృద్ధి కలుగుతుంది. ప్రయాణాలు కలసివస్తాయి . వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

*వృషభం*

చేపట్టిన పనులలో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగమున కొంత నిరుత్సాహం తప్పదు వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.

*మిధునం*

దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీర్చగలరు.ఆరోగ్య పరమైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు శ్రమాధిక్యతతో పూర్తి చేస్తారు.కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది.ఉద్యోగపరంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. స్వల్ప ధన ప్రాప్తి కలుగుతుంది.

*కర్కాటకం*

ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి.నూతన ఉద్యోగ లబ్ది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.కుటుంబ సభ్యులతో విందువినోదాలు కార్యక్రమాల్లో పాల్గొంటారు విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

*సింహం*

ఉద్యోగ వ్యవహారాలలో తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేసి పై వారినుండి ప్రశంసలు పొందుతారు.గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. దూరప్రాంతాల వారి నుండి విలువైన సమాచారాన్ని సేకరిస్తారు వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టి లాభాలు పొందుతారు.

*కన్య*

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలసి వస్తాయి.ముఖ్యమైన వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు వలన లాభం పొందుతారు. ధనదాయం బాగుంటుంది. అనారోగ్య సూచనలున్నవి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

*తుల*

వృత్తి ఉద్యోగ విషయమై కీలక సమాచారాన్ని సేకరిస్తారు. ఆరోగ్య విషయాలలో జాగ్రత్తగా ఉండాలి అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలు పరంగా నష్టాల ఊబి నుండి బయటపడతారు గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.

*వృశ్చికం*

అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు . వ్యాపారాలు విస్తరిస్తారు.పనులు సకాలంలో పూర్తి చేస్తారు.గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

*ధనస్సు*

వ్యాపార పరంగా ఇబ్బందులు తొలగుతాయి. ధన విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది.పనులు నిదానంగా పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూరప్రాంత ప్రయాణాలు చేస్తారు.

*మకరం*

ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరించడం మంచిది. రుణ బాధలు తొలగుతాయి.భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయట పడగలుగుతారు.

*కుంభం*

సంతానమునకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి సోదరుల సహాయ సహకారాలు పొందుతారు.వ్యాపారం వృద్ధి చెందుతుంది.

*మీనం*

ప్రయాణాలలో మార్గావరోధాలు కలుగుతాయి.చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నేత్ర సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగ విషయమై అనాలోచిత నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధువుల నుండి విమర్శలు ఎదురవుతాయి.
—————————————