నేటి రాశి ఫలాలు…

సోమవారం, 25.1.2021 – శ్రీశార్వరినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్య మాసం, తిథి శు.ద్వాదశి రా.11.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం మృగశిర రా.1.05 వరకు, తదుపరి ఆరుద్ర, వర్జ్యం ..లేదు. దుర్ముహూర్తం ప.12.33 నుంచి 1.20 వరకు, తదుపరి ప.2.48 నుంచి 3.34 వరకు, అమృతఘడియలు…ప.3.34 నుంచి 5.12 వరకు, రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు, యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు, సూర్యోదయం 6.38, సూర్యాస్తమయం 5.47

రాశి ఫలాలు:
మేషం: పనుల్లో అవరోధాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్య సూచనలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ఆశాజనకంగా ఉంటాయి.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

కర్కాటకం: కార్యజయం. ఆస్తిలాభ సూచనలు. పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

సింహం: పనులు విజయవంతంగా సాగిస్తారు. ధన, వస్తులాభాలు. ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

కన్య: రుణదాతల ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. ఆరోగ్యసమస్యలు. భూవివాదాలు. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. కుటుంబంలో చికాకులు. ఆప్తుల నుంచి పిలుపు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పనులు చకచకా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మకరం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కుంభం: ఆప్తుల నుంచి సమస్యలు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార విస్తరణ ముందుకు సాగదు. ఉద్యోగస్తులకు చిక్కులు.

మీనం: ఇంటాబయటా అనుకూలం. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ప్రత్యేక గౌరవం. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.