లేడి-కాకి-నక్క కథ….

లేడి-కాకి-నక్కకథ..

పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, లేడి ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికి ఇచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చి పెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచిచెడులు మరొకరికి చెప్పు కొనుచు అన్యోన్యంగా జీవిస్తున్నాయి.

ఆ అడవిలోనే నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి, ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేత మేసే లేడి వద్దకు వెళ్లి “నమస్కారం లేడి బావగారూ! నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూరజంతువుల బాధపడలేక యిటువచ్చాను. వచ్చీ రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో చెలిమి చేయాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసుకదా! ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం” అని ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది.

లేడి నక్క మాటలు నమ్మింది. “ఆపదలో ఉండి శరణువేడి స్నేహం కోరివచ్చిన తోటి జంతువుని ఆదరించటం కనీస ధర్మం” అని భావించినది. నక్కతో స్నేహం చేయతలచి “నక్క బావా? నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతోపాటు ఉందువుగాని మా యింటికి వెళదాం రా!” అని దానిని వెంటబెట్టుకొని కాకి వద్దకు వచ్చి, దానికి నక్క విషయమంత చెప్పినది. కాకి జింకతో “మిత్రమా! మంచి చెడు ఆలోచించక, కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహము చేయరాదు. ఇది జిత్తులమారి నక్క. పైగా మాంసాహారి కూడా, దాని గుణగణాలు మనకి తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. వారివారి గుణగణములు తెలియక ఎవ్వరినిబడితే వారిని దరికి చేరనిస్తే పిల్ల మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణములు పోయిన గ్రద్దవలె అగును. ఆ కథ చెప్తాను ఆలకించు అంటూ ఆ కథ చెప్పసాగింది.

గ్రద్ద-పిల్లి కథ
పూర్వం గంగానది ఒడ్డున ఒక పెద్ద జువ్వి చెట్టు ఉన్నది. దానిమీద ఎన్నో పక్షులు నివశిస్తున్నాయి. అదే చెట్టు తొర్రలో “జరద్గవము” అను ఒక గుడ్డిగద్దజీవిస్తున్నది. గుడ్డితనానికి తోడు ముసలితనం తోడై ఆహారం తెచ్చుకోడానికి కూడా చేత కాక అవస్థపడుచున్నది. దానిని చూచి పక్షులు జాలిపడి తాము సంపాదించిన ఆహారంలో కొంత దానికి పెట్టేవి. అందుకుగాను ఆ చెట్టుపైనున్న పక్షిపిల్లలను కాపాడుతూ గ్రద్ద కాలం గడుపుచున్నది. ఇలా ఉండగా ఒకనాడు పక్షులన్నీ ఆహారం కోసం వెళ్ళడం చూచి “దీర్ఘకర్ణము” అనే జిత్తులమారి పిల్లి పక్షి పిల్లలని తినాలని ఆ చెట్టు ఎక్కింది.

పిల్లిని చూచి భయపడి పక్షిపిల్లలు అరవసాగినవి. శత్రువెవడో వచ్చాడని గ్రహించి గ్రద్ద “ఓరీ దుర్మార్గుడా! నీవేవ్వడవు? ఇక్కడకు ఎందుకు వచితివి?” అని గద్దించింది. “నేను దీర్ఘకర్ణమనే పిల్లిని” అని చెప్పగా వినిన గ్రద్ద “నువ్వా! తక్షణమే ఇక్కడి నుండి వెళ్లిపొమ్ము, పోకపోతే నీ ప్రాణాలు నీకు దక్కవు, పోతావా? లేదా? అని కోపంగా గద్దించింది. గ్రద్ద మాటలకు పిల్లి గజగజలాడి, అయ్యా! నేను ఎంత పాపం చేసితినో ఈ పిల్లి జన్మనెత్తితిని. అనేక పాపములాచారించితిని. కొంత కాలంగా నాకు జ్ఞానము కలిగి మాంసము ముట్టక, సత్వము తప్పక చాంద్రాయణ వ్రతమాచారించితిని. గంగా స్నానము చేసి పెద్దలవలన ధర్మ మార్గము తెలుసుకొనవలెనని ఆశతో మీ వద్దకు వచ్చితిని కాని, వేరొక దురాలోచన నాకు లేదు. కాబట్టి నాయందు దయ ఉంచి నన్ను శిష్యునిగా స్వీకరించండి” అని గ్రద్దతో పలికింది. పిల్లి వినయంగా పలికిన మాటలకు గ్రద్ద సంతోషించి, పిల్లిని తన శిష్యునిగా అంగీకరించింది. ఆనాటి నుండి ప్రతిరోజూ పక్షులు లేనిసమయంలో ఆ చెట్టుపై గ్రద్ద-పిల్లి కాలక్షేపం చేయసాగాయి. కొన్నిరోజులు అలానే నమ్మకం కలిగించి పిల్లి తెలివిగా చెట్టుమీదుకు పాకి గూళ్ళలోని పక్షిపిల్లలని తిని, ఆ ఈకలను, ఎముకలను గ్రద్ద నివశించుచున్న చెట్టు తొర్రలో పడవేసింది. గ్రుడ్డిగ్రద్దకు ఈ విషయమేమియు తెలియదు.

క్రమంగా పక్షులకు తమ పిల్లలు పోవుచున్నవనే అనుమానం కలిగింది. వెంటనే గ్రద్దను అడిగాయి. అది తనకేమీ తెలియదని అన్నది. కాని దాని తొర్రలో ఉన్నా ఈకలను, ఎముకలను చూచి “ఈ పాడు గ్రద్ద మనమిచ్చే ఆహారం చాలక మనం లేని సమయం చూచి మన పిల్లలని పొట్టనబెట్టుకొన్న”దని భావించి, పక్షులన్నీ కలిసి గ్రద్దను పొడిచి చంపేశాయి. కాబట్టి కొత్తగా వచ్చిన వారిని నమ్మి దగ్గరకు చేరనీయరాదు” అని కాకి(లఘుపతనకము) జింకతో(చిత్రాంగుని)తో పలికెను.

కాకి మాటలు విన్న జింక కాకితో “మిత్రమా! వేరే జాతుల వారమైనా మనమిద్దరం స్నేహంగా ఉండటం లేదా! అలాగే ఈ నక్క కూడా మనతో కలిసి ఉంటుంది. జాతికన్నా గుణం ముఖ్యం కదా, ఇది నాకు మంచిదే అనిపిస్తుంది, మనతోనే ఉండనిద్దాం” అని అన్నది. మిత్రుని మాట కాదనలేక కాకి సరే అంది. ఆరోజు నుండి కాకి, నక్క, జింక ఎంతో సంతోషంగా ఉంటున్నాయి. జిత్తులమారి నక్క సమయం చూచి లేడి మాంసం తినాలని ఆలోచించసాగింది. ఒకనాడది జింక వద్దకు వచ్చి “మిత్రమా! ఆ పక్కన చక్కటి పచ్చిక ఉంది, రేపు మేతకు అటు వెళదాం అంది. జింక కూడా సరే అంది. మరునాడు రెండూకలిసి అటువైపుగా మేతకు వెళ్ళినవి. అక్కడ పచ్చికయే కాక జొన్న చేను కూడా ఉంది. దానిని చూచి లేడి ఆనందించింది. ప్రతిదినం ఆ పొలంలో కడుపారా పైరు మేయసాగింది. పొలం కాపు అది గ్రహించి లేడిని బంధించుటకు వలపన్ని ఇంటికి పోయాడు. మరునాడు యథాప్రకారం మేతకు వచ్చిన జింకఆ వలలో చిక్కుకున్నది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అంతలో నక్క అక్కడికి వచ్చింది. వలలో చిక్కిన జింకని చూచి అదిలోలోపల ఎంతగానో సంతోషించింది. నక్కను చూచి జింక “మిత్రమా! మంచి సమయంలోనే వచ్చావు, పొలం కాపు వచ్చు వేళయింది. కనుక వెంటనే వల కొరికి నా ప్రాణాలను కాపాడు” అని వేడుకుంది. అది విని నక్క వలను కొరుకుటకు వెళ్ళినట్లే వెళ్లి వెనుకకు తగ్గి “మిత్రమా! ఈ వల నులినరములతో చేయబడినది, నేడు ఆదివారము, నేను నరములను ముట్టను, ఈ పని తప్ప మరేపనైనా చెప్పు చేసెదను” అని మెల్లగా అచట నుండి జారుకొన్నది. కాని ఆ నక్క ఆ పక్కనే ఒక పొదలో దాక్కొని పొలం కాపు రాక కోసం ఎదురుచుడసాగింది. పొలం యజమాని వచ్చి లేడిని చంపి, బయటకు వేయగానే దాని మాంసము కడుపారా తినవచ్చని ఎంతో సంతోషంగా ఉన్నది నక్క…ఇంతలో కాకితన మిత్రుడైన జింక ఎంతవరకూ రాకపోవుట చేత దానిని వెతుకుతూ బయలుదేరింది. అలా వెతుకుతుండగా దానికి ఒకచోట వలలో చిక్కిన జింకని చూచి, కిందకు దిగి “మిత్రమా, ఏమిటి ఈ దారుణం, ఏం జరిగింది అని అడిగింది కాకి. కాకి మాటలు విన్న జింక కన్నీరు కారుస్తూ “మిత్రమా! ఆరోజు నీవు చెప్పిన మాటలు విననందుకు ఇది ఫలితం” అనగానే కాకి ఆ నక్క ఎక్కడ అని అడిగింది.”అది నా మాంసం తినవలెనని ఇక్కడే ఎక్కడో నక్కి ఉండి ఉంటుంది” అని విషయం వివరంగా చెప్పింది. అంతలో దూరంగా పొలం కాపు కనిపించాడు. కాకి జింకతో “మిత్రమా! పొలం కాపు వస్తున్నాడు. నాకు ఒక ఉపాయం గుర్తుకు వచ్చింది. నీవు తక్షణం ఊపిరి బిగపట్టి చచ్చిపోయినట్లు పడుకొని ఉండు. నేను నీ కన్నులు పొడుచుచున్నట్లు నటిస్తాను, పొలంకాపు వచ్చి నిన్ను చూచి చిచ్చిపోయవని వల నుండి వేరు చేయగానే, నేను “కావ్ కావ్” అని అరిచిన వెంటనే నీవు లేచి పరుగెత్తు”అనిచెప్పింది. జింక సంతోషించి సరే అని ఆ విధంగానే చేసింది…పొలం కాపు వలనుండి జింకను వేరు చేయగానే వెంటనే అది కాకి చెప్పినట్లుగా పరుగెత్తింది. అది చూచి పొలంకాపు ఆశ్చర్యపోయాడు. తనను మోసం చేసిందని గ్రహించి, దీనికి తగిన శాస్తి చేస్తానని తన చేతిలో ఉన్న పెద్దకర్రని దానికి తగిలేలా విసిరాడు. అది అదృష్టవశాత్తు జింకకి తగలలేదు. గురి తప్పిపాడు బుద్దితో పొదలో దాక్కున నక్కకు తగిలింది. వెంటనే అది గిలగిల తన్నుకొని అక్కడే చచ్చిపోయింది….కావున “నీతో స్నేహం చేయుట నిప్పును పట్టుకొని కాలింది అని బాధపడ్డట్టు ఉంటుంది” అనగా అప్పుడు కాకి “ఆర్యా! కాకి జాతిలో పుట్టినంత మాత్రాన నన్ను పాపాత్మునిగా బావించకు. నిన్ను చంపి తినినంత మాత్రాన నా ఆకలి తీరునా? మృత్యువు ఎవరికీ ఎప్పుడు ఏ విధంగా కలుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను నీకు ఏవిధమైనటువంటి అపకారం చేయను. చిత్రగ్రీవునితో ఎంత స్నేహంగా ఉన్నావో నాతో కూడా అలాగే ఉండు, అనుమానించక నా కోరిక నెరవేర్చు, నాకు సంతోషం కలిగించు మిత్రమా!” అన్నది…హిరణ్యకుడు కాకి పట్టుదలకు సంతోషించి స్నేహానికి అంగీకరించింది. అప్పటి నుండి కాకి, ఎలుక స్నేహంగా కొన్నాళ్ళు కాలం గడిపాయి. కొంతకాలం తరువాత కాకికి ఆహారం దొరుకుట కష్టమైపోయింది. అది దండకారణ్యంలో ఉన్న తన మిత్రుడు మందరుడనే తాబేలు వద్దకు పోవాలని నిశ్చయించుకుని, ఆ విషయంహిరణ్యకునికి చెప్పింది. హిరణ్యకుడు “మిత్రమా! ఆహారం దొరకక కడుపు మాడ్చుకొని ఇక్కడే ఉండమని చెప్పలేను. పోయిరమ్మని చెప్పి నిన్ను ఒదిలి నేను ఒంటరిగా ఉండలేను. మందరుని వద్దకు నన్ను కూడా తీసుకొని వెళ్ళుము. కష్టమో, సుఖమో, మన ముగ్గురం కలిసి ఒక చోటనే ఉందాం” అని చెప్పింది…కాకి ఎలుకను తన వీపు మీద ఎక్కించుకొని దండకారణ్యము వదిలి వేరొక అడవిలో ఒక చెరువు గట్టుపై వాలింది. అదే సమయమున చెరువు ఒడ్డునకు వచ్చిన మందరుడు లఘుపతనకమును(కాకి)చూచి “మిత్రమా! ఎంతకాలమునకు కనబడితివి, క్షేమముగా ఉన్నావు కదా! అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. తరువాత లఘుపతనకము మందరునకు హిరణ్యకుని పరిచయం చేసి, అతని మంచి గుణములను వివరించింది. మందరుడు హిరణ్యకుని ఎంతో గౌరవించి, హిరణ్యకుని గురించి తెలుసుకొనదలచి అతనితో “మిత్రమా! ఎలుకలు పల్లెలలో పట్టణములలో నివశించుచుండగా నీవీ అడవిలో ఉండుటకు కారణమేమి? నీకు పల్లెలలో ఉండుట నచ్చలేదా? మొదటి నుండి అడవిలోనే నివశించుచున్నావా? అని అడిగింది.

హిరణ్యకుడు నవ్వి “కాదు మిత్రమా! నేను అందరివలె ఒక పట్టణమునే నివశించితిని. కొంతకాలం వరకు సుఖంగానే బ్రతికాను. కాని చివరకు సర్వం కోల్పోయి చావు తప్పి జనసంచారము లేని అడవికి వచ్చి జీవయాత్రని కొనసాగించుచుంటిని. నా కథ చెప్పెదను వినండి!” అని ఈవిధంగా చెప్పసాగింది…