బ్రిటన్ లోని కెంట్ లో మొదట కనుగొన్న కరోనావైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు హెచ్చరికలు..

బ్రిటన్ లోని కెంట్ లో మొదట కనుగొన్న కరోనావైరస్ వేరియంట్ అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్త ఒకరు హెచ్ఛరిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ టీకామందులకు అది లొంగుతున్న సూచనలు కనబడడంలేదని యూకే లోని కోవిద్ 19 జీనోమిక్స్ కన్సార్టియం శాస్త్రవేత్త షారోన్ పీకాక్ అంటున్నారు.   దేశంలో ఈ వేరియంట్ బలంగా ఉందని, బహుశా ఇది క్రమంగా ప్రపంచాన్ని స్వీప్ చేయవచ్ఛునని ఆమె చెప్పారు. సాధారణ కరోనా వైరస్ 20 లక్షల మందికిపైగా ప్రాణాంతకం కాగా కొన్ని వేరియంట్లు మరింత ప్రమాదకరంగా ఉన్నాయని ఆమె అన్నారు. వీటి కారణంగా ప్రస్తుత వ్యాక్సిన్లను ఎంతో మార్చాల్సి ఉంటుందని, ప్రజలు బూస్టర్ షాట్స్ తీసుకోవలసి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.1.1.7 అనే ఈ వేరియంట్ ను తాము కొన్ని నెలలుగా అధ్యయనం చేస్తున్నామని, ఇది తిరిగి మ్యుటెంట్ వైరస్ గా మారి  సాధారణ టీకామందులను కూడా నిష్ప్రయోజనంగా మార్చవచ్చు అన్నారు. బ్రిస్టల్ లో కనుగొన్న వేరియంట్ ను వేరియంట్ ఆఫ్ కన్సర్న్ గా భావిస్తున్నట్టు షారోన్ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా, బ్రెజిల్ వేరియంట్లలో కంబడే రకాల్లో ఇది కూడా భాగమై ఉండవచ్చు.. ఈ 484కె మ్యుటేషన్ కు సంబంధించిన 21 కేసులను మేం కనుగొన్నాం.. మా పరిశోధన ఇంకా కొనసాగుతోంది అని ఆమె చెప్పారు.