న్యూజెర్సీలో అట్టహాసంగా బోనాల పండగ…

.

తెలంగాణ బోనాల జాత‌ర సంబురాలు ఖండంత‌రాలు దాటింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే బోనాల పండుగను అమెరికాలో సోమవారం ప్రవాసీయులు మొట్టమొద‌టి సారిగా అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించారు. హైద‌రాబాద్‌ లాల్‌ దర్వాజ, లష్కర్‌ బోనాలను మరిపించే విధంగా, పోతురాజు నృత్యాలతో అట్టహాసంగా నిర్వహించారు.తెలుగు మహిళలు బోనమెత్తారు. అమ్మ వారిని మేళతాళలతో ఘనంగా స్వాగతించి, పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి బోనం సమర్పించారు. తెలంగాణ – అమెరికా ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ప్రార్థించారు. సాయిద‌త్తాపీఠం చైర్మెన్ ర‌ఘుశ‌ర్మ శంక‌ర‌మంచి పూజ‌లు నిర్వహించారు.
ఈ సంద‌ర్భంగా.అధ్యక్షుడు శ్రీనివాస గనగోని మాట్లాడుతూ..

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అన్నారు. అందరికి బోనాల శుభాకాంక్షలు తెలిపారు.

అమెరికాలో తొలిసారిగా బోనాల పండుగ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్‌లో మాట ఆధ్వర్యంలో మరిన్నీ కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సభ్యులు కిరణ్ దుద్దగి, విజయ్ భాస్కర్ కలాల్, శ్రీధర్ గుడాల, దాము గేదెల, జైదీప్ రెడ్డి, కృష్ణశ్రీ గంధం, మహేందర్ నరలా, వెంకీ మస్తీ, కృష్ణ సిద్ధదా, రంగారావు మాడిశెట్టి, గిరిజా మాదాసి, మహిపాల్ రెడ్డి, రాకేష్ కస్తూరి, ప్రభాకర్, పూర్ణ, శేష‌గిరిరావు, శిరీషా గుండపనేని, రఘు మడుపోజు, దీపక్ కట్టా, సురేష్ ఖజానా, అశోక్ చింతకుంట, మాధవి సోలేటి త‌దిత‌రులు పాల్గొన్నారు…