కొత్త రేషన్‌ కార్డులపై రేవంత్‌ సర్కార్‌ ఫోకస్‌…!

కొత్త రేషన్‌ కార్డులపై రేవంత్‌ సర్కార్‌ ఫోకస్‌..

–వచ్చే కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయం
–కేబినెట్‌ ఎజెండాలో కొత్త రేషన్‌ కార్డుల అంశం
–ప్రభుత్వ పథకాలకు రేషన్‌కార్డే ప్రామాణికం
–కొత్త కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు వెయిటింగ్‌
–కుటుంబసభ్యుల పేర్లను చేర్చేందుకు ఎదురుచూపుల
–కొత్త రేషన్‌కార్డులకు దరఖాస్తు చేయడం ఎలా?
–మీ సేవాల ద్వారా అప్లికేషన్‌ తీసుకోవాలా?
–కొత్త కుటుంబసభ్యుల్ని చేర్చడం ఎలా?
అనేదానిపై కేబినెట్‌ మీటింగ్‌లో నిర్ణయం
–ప్రజాపాలనలో రేషన్‌కార్డుల కోసం భారీగా దరఖాస్తులు..

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అప్లై చేయాలని లక్షలాది కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి. గత తొమ్మిదేళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగకపోవడంతో ఎప్పుడెప్పుడు ఇందుకు సంబంధించిన జారీ ప్రక్రియ షురూ అవుతుందని జనమంతా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది..తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ దిశగా అడుగులేస్తుండటం ప్రజలకు శుభ పరిణామం. ఎవ్వరికీ అన్యాయం జరగకుండా సరైన విధివిధానాలు రూపొందించి రేషన్ కార్డుల కోసం అప్లికేషన్స్ తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది..కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై రేవంత్ సర్కార్ ఇప్పటికే కసరత్తులు షురూ చేసింది. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించి.. కొత్త రేషన్ కార్డుల జారీపై చర్చలు జరిపారు..