భారత వైమానిక దళానికి కొత్త యూనిఫాం అందుబాటులోకి వచ్చింది. శనివారం చంఢీగడ్‌లో జరిగిన 90వ భారత వైమానిక దళ వార్షికోత్సవాల్లో ఈ యూనిఫాంను ఎయిర్ చీఫ్ వివేక్ రామ్ చౌదరి ఆవిష్కరించారు. ఇంతకు ముందు ఉన్న యూనిఫాం కంటే ఇప్పుడు మరింత డిఫరెంట్‌గా ఉంది. కాగా ప్రతీసారి భారత వైమానిక దళ వార్షికోత్సవాలు దేశ రాజధాని ఢిల్లీలో జరపడం తెలిసిన విషయమే. కానీ ఈ సారి రాజధాని ఆవల చంఢీగడ్‌లో నిర్వహించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలాంటి వాతావరణంలోనైనా సైనికులు తట్టుకుని నిలబడేలా చేయడం ఈ యూనిఫాం ప్రత్యేకత.
కానీ తొలిసారి రాజధాని ఢిల్లీ వెలుపల ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో 80కి పైగా యుద్ద విమానాలు, హెలికాప్టర్లను సుఖ్నా వాయుసేన ప్రదర్శించింది.
ఈ వేడుకలకు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐఏఎఫ్ దళం కోసం ప్రత్యేక ఆయుధ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చినట్టు ఎయిర్ చీఫ్ మార్షల్ చౌధరీ తెలిపారు. స్వాతంత్రం తరువాత ఈ తరహా.. ఆయుధ వ్యవస్థ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారని వెల్లడించారు. ఈ ఆయుధ వ్యవస్థతో కేంద్ర ప్రభుత్వానికి 3 వేల 400 కోట్ల రూపాయలు ఆదా కానున్నట్టు చౌధరీ స్పష్టం చేశారు.వైమానిక దళంలోకి మహిళా అగ్నివీరులను కూడా తీసుకుంటామని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ చెప్పారు. ఈ ఏడాది ఐఏఎఫ్ డే ప్రత్యేకంగా స్వదేశీయతపై దృష్టిసారించింది. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ విమానాలను, ఆయుధాలను ప్రదర్శించారు. అందులో వాయుసేన అమ్ముల పొదిలో చేరిన ప్రచండ్ కూడా ఒకటి. ఇది అత్యాధునిక తేలికపాటి యుద్ధ హెలికాప్టర్. ఇటీవల దీనిని వైమానిక దళంలోకి ప్రవేశపెట్టారు..