ఏ దేశం కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనుంది.? ఎక్కడ తొలుత వేడుకలు జరుగుతాయి.? ఏ దేశంలో చివరిగా వేడుకలు జరుగుతాయి.

పాత ఏడాదికి గుడ్‌ బై చెబుతూ, కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెప్పేందుకు ప్రపంచమంతా సిద్ధమవుతోంది. దేశాలు, మతాలు, కులాలు, ప్రాంతాలు ఇలా..ఎలాంటి బేధం లేకుండా జరుపుకునే ఏకైక వేడుక న్యూ ఇయర్‌ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో కొత్తేడాది వేడుకలు జరుపుకుంటారు. ఆయా దేశాల ఆచార, సంప్రదాయాల ఆధారంగా పండుగలను జరుపుకుంటారు.

ఇదంతా ఇలా ఉంటే.. ఏ దేశంలో అయితే మొదట అర్థరాత్రి 12 గంటలు దాటుతుందో అదే దేశంలో తొలుత న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకుంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇది ఆయా దేశాల టైమ్‌ జోన్‌ ఆధారంగా ఉంటుంది. మరి ప్రపంచంలో తొలుత
ఏ దేశం కొత్త ఏడాదిలోకి ఎంట్రీ ఇవ్వనుంది.? ఎక్కడ తొలుత వేడుకలు జరుగుతాయి.?
ఏ దేశంలో చివరిగా వేడుకలు జరుగుతాయి..

ప్రపంచంలో అందరి కంటే ముందు 2024లోకి ఎంట్రీ ఇవ్వనున్న దేశం సమోవా. సెంట్రల్‌ సౌత్‌ పసిఫిక్‌ ఓషన్‌లో ఉండే ఈ దేశంలో తొలుత కొత్తేడాది వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ సన్‌సెట్‌, సన్‌రైజ్‌ చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా, జపాన్‌, సౌత్‌ కొరియా దేశాల్లో కొత్తేడాది వేడుకలు ప్రారంభమవుతాయి.
ఇక అందరికంటే ఆలస్యంగా నూతన సంవత్సర వేడుకలు బేకర్‌ ద్వీపంలో జరుపుకుంటారు. ఇండియన్‌ స్టాండర్డ్‌ సమయం ప్రకారం సాయంత్రం 5.50కి ఆ దేశంలో కొత్తేడాది ప్రారంభమవుతుంది.

ఇండియన్‌ స్టాండర్డ్ సమయం ప్రకారం ఏయే దేశాల్లో ఏ సమయంలో న్యూ ఇయర్‌ మొదలవుతుందంటే..

* డిసెంబర్‌ 31 మధ్యాహ్నం 3.30 గంటలకు సమోవాలో కొత్తేడాది వేడుకలు ప్రారంభమవుతాయి.

* సాయంత్రం 4.30 గంటలకు న్యూజలాండ్‌.

* సాయంత్రం 5.30 గంటలకు రష్యాలో.

* సాయంత్రం 6.30 గంటలకు ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్నో, సిడ్నీ, కాన్‌బెర్రాలో.

* సాయంత్రం 7 గంటలకు ఆడిలైడ్‌, బ్రోకెన్‌ హిల్‌, కెడునా.

* సాయంత్రం 7.30 గంటలకు బ్రిస్బన్‌, పోర్ట్‌ మొరెస్బీ, హగంటా.

* రాత్రి 8 గంటలకు డార్విన్‌, టెన్నంట్‌ క్రీక్‌.

* రాత్రి 8.30 గంటలకు జపాన్‌, సౌత్‌ కొరియా, టోక్యో, సియోల్‌, డిలీలో.

* రాత్రి 9.30 గంటలకు చైనా, ఫిలిప్పిన్స్‌.

* రాత్రి 10.30 గంటలకు ఇండోనేషియా, థాయ్‌లాండ్‌.

* రాత్రి 11 గంటలకు మయన్మార్‌.

* రాత్రి 11.30 గంటలకు బంగ్లాదేశ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు ప్రారంభమవుతాయి.

* రాత్రి 11.45 గంటలకు ఖట్మండ్‌, ధరన్‌.

* అర్థరాత్రి 12 గంటలకు భారత్, శ్రీలంకలో.

* 12.30 గంటలకు పాకిస్తాన్‌లో.

* ఒంటి గంటకు ఆప్ఘనిస్థాన్‌లో.

* ఉదయం 5.30 గంటలకు యూకేలో కొత్తేడాది ప్రారంభమవుతుంది.

* ఇక ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కెనడా, అమెరికాలో కొత్తేడాది ప్రారంభమవుతుంది.

* చిట్ట చివరిగా సాయంత్రం 5.50 గంటలకు బేకర్‌ ఐలాండ్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతాయి.