మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్ల ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం..!

సామాన్యుడికి కేంద్ర బ‌డ్జెట్ షాకిచ్చింది. ఇవాళ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ ప్ర‌కారం.. దిగుమ‌తి చేసుకున్న మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్ల ధ‌ర‌లు పెర‌గొచ్చ‌ని తెలుస్తోంది. బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా నిర్మ‌లా సీతారామ‌న్ మాట్లాడుతూ.. ఆయా వ‌స్తువుల‌పై క‌స్ట‌మ్స్ డ్యూటీ 5 నుంచి 10 శాతానికి పెంచుతున్న‌ట్లు వెల్ల‌డించారు. దీంతో మొబైల్ ఫోన్లు, ఛార్జ‌ర్ల ధ‌ర ఒక శాతం నుంచి 2 శాతం వ‌ర‌కూ పెరిగే అవ‌కాశం ఉంది. ఛార్జ‌ర్ల‌పై సుంకాన్ని 15 నుంచి 30 శాతానికి, మ‌ద‌ర్ బోర్డుల‌పై 10 నుంచి 20 శాతానికి, మొబైల్ త‌యారీలో వినియోగించే విడి భాగాల‌పై కూడా సుంకాన్ని పెంచ‌నున్నారు. మొబైల్స్‌పై ఉన్న 10 శాతం స‌ర్వీస్ వెల్ఫేర్ సెస్ మిన‌హాయింపును ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ చ‌ర్య‌ల వ‌ల్ల దేశీయ ఉత్ప‌త్తి విలువ సామ‌ర్థ్యం పెరుగుద‌ల సాధ్యం అవుతుంద‌ని నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన్నారు.