దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ భేటి…

దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ భేటి.

టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరే శ్రీరామ్ నేతృత్వంలో భేటీకి హాజరైన కేంద్ర జల సంఘం, జాతీయ జల రవాణా అభివృద్ధి సంస్థ, జల శక్తి మంత్రిత్వశాఖ, వ్యాప్కోస్, నీటి వనరుల విభాగాలకు చెందిన అధికారులు.

గోదావరి-కావేరి, మహనది-గోదావరి, కెన్-బెట్వా, పర్బతి-ఖాళీ సింధ్-చంబల్, పిఎఆర్-తాపీ-నర్మద మరియు దమన్ గంగా-పింజల్, మానస్-సంకోష్-తీస్తా-గంగా నదుల అనుసంధానం,

మొత్తం ఆరు అనుసంధానాలపై కీలకంగా చర్చించిన టాస్క్ ఫోర్స్.

గోదావరి నది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలను పూర్తి పరిగణలోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్.

గోదావరి, కృష్ణ నదుల నీటి వినియోగంలో ఇప్పటికే ట్రిబ్యునల్స్ ఇచ్చిన రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటున్న విధానంలో ఎలాంటి తేడాలు రావని స్పష్టం చేసిన టాస్క్ ఫోర్స్.

గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి కావేరి అనుసంధానంలో మిగులు జలాలను మాత్రమే కావేరి బేసిన్ కు తరలించాలని టాస్క్ ఫోర్స్ కీలక నిర్ణయం.

గోదావరి- కృష్ణ అనుసంధానం కోసం ఏర్పాటు చేసే లింక్ కెనాల్ ద్వారా అవకాశం ఉన్నంత మేరకు కొత్త ఆయకట్టుకు కూడా తీసుకువచ్చేందుకు పథకం రూపొందిస్తున్నట్లు వెల్లడి.

అదే రీతిలో కృష్ణ నుంచి కావేరికి అనుసంధానించే లింక్ ద్వారా అదనపు ఆయకట్టుకు అవకాశం కల్పిస్తూ రెండు లింక్ లలో రాష్ట్రాల కేటాయింపులు వినియోగించుకునేల ప్రణాళికలు రూపొందించాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయం.

ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ కు ఒక లింక్, నాగార్జున సాగర్ నుంచి కావేరి అనుసంధాననికి మరో లింక్ ద్వారా నీటిని సరఫరా చేయడానికి ప్రణాళిక.

ఇచ్చంపల్లి-సాగర్ లింక్ ద్వారా తెలంగాణలో ఆ రాష్ట్రానికి కేటాయించిన గోదావరి జలాల వినియోగంలో ఎటువంటి మార్పులు లేకుండానే పథకం కొనసాగుతుందని వెల్లడి.

కృష్ణ జలాల విషయంలో శ్రీశైలం నుంచి నీటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని టాస్క్ ఫోర్స్ భేటీలో చర్చ.

గోదావరిలో ఛత్తీస్ ఘడ్ వినియోగించుకోని అదనపు జలాలను మాత్రమే కావేరికి తరలించాలని టాస్క్ ఫోర్స్ నిర్ణయం.

రెండు రాష్ట్రాల ప్రయోజనాలకు ఎక్కడా విఘాతం కలగకుండా కేంద్ర ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకోవడంతో పాటు రాష్ట్రాలకు పూర్తి సహాయ, సహకారాలను అందించనున్నట్లు వెల్లడి.

హిమాలయ నదుల నుంచి మహానది వరకు అక్కడి నుంచి కావేరి బేసిన్ కు నీటి తరలింపులో ఆయా రాష్ట్రాల ప్రాధాన్యతలు, ప్రయోజనాలు, కేటాయింపులు, వినియోగానికి అనుగుణంగానే అనుసంధానం ఉంటుందని స్పష్టం చేసిన టాస్క్ ఫోర్స్.

ఇచ్చంపల్లి నుంచి ప్రారంభించే లింక్ ద్వారా తెలంగాణలో నీటి కొరత ఉన్న ప్రాంతాలు లబ్ది పొందుతాయని కూడా అంచనా వేసిన టాస్క్ ఫోర్స్.

సమగ్ర నివేదిక- డిపిఆర్ లో అమలు తీరుతెన్నులను సంబంధించిన వ్యవహారాలన్నీ పొందుపరిచి తద్వారా ముందుకు వెళ్లేందుకు నిర్ణయం.