ఈనెల 10నుంచి 16వరకు పద్మావతి-గోదాదేవిల సమేత శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు…

ఈనెల 10నుంచి 16వరకు పద్మావతి-గోదాదేవిల సమేత శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
-12న కళ్యాణోత్సవం,14న రథోత్సవం
– బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్…

ఈనెల 10నుంచి 16వరకు పద్మావతి-గోదాదేవిల సమేత శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవరకొండ శాసన సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.గురువారం ఎమ్మెల్యే క్యాంపు శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ఈనెల 12న కళ్యాణోత్సవం,14న రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పద్మావతి-గోదాదేవిల సమేత శ్రీవెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగల ప్రతాప్ రెడ్డి,PACS చైర్మన్ వెలుగురి వల్లపు రెడ్డి,మాజీ మార్కెట్ కమిటీ వైస్,పద్మావతి-గోదాదేవిల సమేత శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్,అర్వపల్లి నర్సింహ,తోటకురి పరమేష్,రమావత్ చందు,మద్దిమడుగు కర్ణయ్య, మైనం జనయ్య,బోడ్డుపల్లి కృష్ణ ,శ్రీనివాస్,అంజి రెడ్డి, మహేష్,కిషన్,తదితరులు పాల్గొన్నారు