ఎర్రకోటను ముట్టడి చేసిన ఘటనతో కేంద్ర సర్కార్ సీరియస్

ఢిల్లీలో రైతులు రిపబ్లిక్ డే రోజున ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. ర్యాలీ దారిమళ్లించి ఎర్రకోటవైపు మళ్లడంతో పాటుగా ఎర్రకోటను ముట్టడి చేసిన ఘటనతో యావత్ భారతదేశం షాక్ అయ్యింది. దీనిపై కేంద్ర సర్కార్ సీరియస్ అయ్యింది. ఘటనకు బాధ్యులైన 200 మందిని ఇప్పటికే పోలీసులు అదుపుకోకి తీసుకున్నారు. ఐదుగురు రైతు సంఘాల నాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తమపై కుట్ర జరిగిందని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపణలు చేసింది. ఎర్రకోట వద్ద రైతులను రెచ్చగొట్టారని ఆరోపణలు చేశారు. ఇక ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ సిట్ ను ఏర్పాటు చేసేందుకు సిద్ధం అయ్యింది.