మీడియాకి పైత్యం వేసిందా.. వార్తలు కాస్త ఎంటర్టైన్మెంట్ అయ్యాయా.?..లేక ప్రజా సమస్యలపై పోరాడే సమయం లేదా..??

మీడియాకి పైత్యం వేసిందా.?..

లేక ప్రజా సమస్యలపై పోరాడే సమయం లేదా..

ఎవరో సినీ స్టార్ భార్య డెలివరీకి సిద్ధమైతే గేటు ముందల చుట్టాలు లేకపోయినా బందుగనం లేకపోయినా,, కెమెరాలు పట్టుకొని లోగోలు పట్టుకొని కొడుకు పుడతారా, బిడ్డ పుడతారా, అంటూ ఎస్ఎంఎస్ పోల్ పెట్టుకునే పరిస్థితుల్లో మీడియా తయారయింది…

అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…

ప్ర‌జాస్వామ్యంలో నాలుగో స్తంభం.. ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌కు ప‌ట్టుగొమ్మ‌..
అని చెప్పుకొనే జ‌ర్న‌లిజం విలువ‌ల‌ను
మేం ఎక్క‌డికో తీసుకువెళ్తామ‌నే తెలుగు మీడియాలోని కొంద‌రు అధిప‌తులు ఈ విలువ‌ల‌ను త‌మ‌కు అనుకూలంగా తిప్పుకొంటున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. త‌మ‌కు అనుకూల‌మైన ప్ర‌భుత్వం రాజ్య‌మేలితే.. ఒక విధంగా.. త‌మ‌కు వ్య‌తిరేక రాజ‌కీయ నేత‌లు అధికారంలోకి వ‌స్తే.. మ‌రో విధంగా వార్త‌లు వండి వార్చ‌డం అనేది స‌హ‌జ‌మే! దీనిని ఎవ‌రూ కాద‌న‌లేరు. ఎందుకంటే.. జ‌ర్న‌లిజం అంటేనే రాజకీయాల‌తో ముడిప‌డిన వ్య‌వ‌హారంగా మారిపోయింది కాబ‌ట్టి,, ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి సినీ పరిశ్రమ పై ప్రేమ పెరిగింది..!..

దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సమస్యలు ఉన్న అవేవీ దీనికి సరిరావంటూ హాస్పటల్ ముందల రొట్టె ముక్క కోసం వేచి చూసే కుక్కల ఎదురుచూస్తున్నట్లే ఉన్నారు ..

అమ్మాయి పుడతారా అబ్బాయి పుడతారా అని వార్త కోసం ఎదురుచూస్తున్నట్లు ఉన్నారు..

సోషల్ మీడియాలో ఆ ఫోటోతో ఒక్కసారిగా మీడియాపై ఉన్న గౌరవాన్ని దిగజార్చుకున్నట్లుగా నెట్టిజెన్లు సెటర్లు వేస్తున్నారు…

దేశంలో, రాష్ట్రంలో ఉన్న సమస్యలు వీరి దృష్టిలో లేవా లేకపోతే వారికి అవసరం లేదా..?

ఎప్పుడు పొలిటికల్ హిట్ పై….. ఉండే మీడియా ఇప్పుడు సినీ పరిశ్రమ లోని వ్యక్తులపై వ్యక్తిగత జీవితంలోకి చూస్తున్నారు…
అంతే కాదు బికినీ వేసిన హీరోయిన్ లిప్ టు లిప్ కిస్ పెట్టిన హీరో.. ఇవి వార్తలు..

హీరోల ఎంట్రీ పైనే,,
హీరోయిన్ల వ్యక్తిగత జీవితాల పైనే ప్రస్తుతం వెబ్ ఛానల్ లు కొన్ని శాటిలైట్ ఛానళ్లు పనిచేస్తున్నాయ అనే విమర్శలు కూడా వస్తున్నాయి…

ప్రస్తుతం స్కూలు ప్రారంభమవుతున్నాయి ఆఫీజులపై వార్తలు రాసే దమ్ము వీరికి లేదు..!.

స్కూల్ బస్సులు ఫిట్నెస్ గా ఉన్నాయా లేవా అని కనీసం ఆర్టికల్ రాసే దమ్ము పేపర్ వాళ్లకి లేదు..

రామ్ చరణ్ కి కొడుకు పుడతాడా,, బిడ్డ పడుతుందా..

పవన్ కళ్యాణ్ హరిహి అంటె ఏమిటి..?

ప్రభాస్ కి పెళ్లెప్పుడు అవుతుంది..!

అదిపురుష్ సినిమాలో హిట్ లేక ఫట్….!

ఆ హీరోయిన్ తో ఈ హీరోకి పని ఏంటి..!

ఈ యంగ్ హీరోలకి పెళ్లెప్పుడు అవుతుంది..!

అంబానీ కి మనవరాలు బంగారు ఉయ్యాలో ఊపుడు..!

అంబానీ తినే ఫుడ్ ఖర్చు ఎంతో మీకు తెలుసా..!!

ఇవి నేటి కాలపు వార్తలు..

వీటిని ఎవడైనా వార్తలు అంటారా..?

ఒకవేళ వీటినే వార్తలనుకుంటే అది ఎంటర్టైన్మెంట్ ఛానల్ అవుతుంది న్యూస్ ఛానల్ కాదు..

అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు నేటి వరకు కూడా వారి అకౌంట్లో డబ్బు పడిందా..?

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా..!

పెంచిన టికెట్ ధరలతో సామాన్యుడికి ఎంటర్టైన్మెంట్ దూరం అవుతుందా..!

ఎరువులు సకాలంలో అందుతున్నాయా..!

ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు ఏమిటి..? నెరవేర్చని ఏమిటి..?

ఎమ్మెల్యేల పనితీరు బాగుందా లేదా ప్రజలతో విమర్శలు గుప్పించుకుంటున్నారా..!

చినుకు పడితే చిత్తడే,, త్రాగే నీరు అంతా కలుషితమే….!

ఎండ తీవ్రతకు పెరగడానికి కారణాలేంటి మొక్కలు ఎందుకు నాటరు అనే అవగాహన కల్పించారు..!

గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలు ఏమిటి… మహానగరాల్లో వరదలు వస్తే ఇబ్బంది ఏమిటి…

ఇవి గతకాలకు వార్తలు ప్రస్తుతం అంతా ఎంటర్టైన్మెంట్ వార్తలే అంటూ ప్రజల్లో వార్త ఛానల్ కానీ పత్రికలను గాని చూసే పరిస్థితి లేకుండా యాజమాన్యాల ఇలా తయారు చేసుకుంటున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…