News updates.. ప్రధాన వార్తలు..

Live Update News.

🔺అలియా భట్ మాజీ పీఏ వేదిక ప్రకాష్‌శెట్టి అరెస్ట్
ప్రకాష్‌శెట్టిని అరెస్ట్ చేసిన ముంబై జుహు పోలీసులు
ప్రకాష్‌శెట్టి రూ.76.90 లక్షలు మోసం చేశారని ఆరోపణ
అలియా భట్ ఫిర్యాదుతో ప్రకాష్‌శెట్టిపై కేసు నమోదు.
నాటకీయ పరిణామాలలో, ముంబైలోని జుహు పోలీసులు నటి అలియా భట్ మాజీ వ్యక్తిగత సహాయకురాలు వేదికా ప్రకాష్ శెట్టిని భట్ ప్రొడక్షన్ హౌస్ మరియు వ్యక్తిగత ఖాతాల నుండి రూ. 76.9 లక్షలను అపహరించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. నెలల తరబడి ఎగవేత తర్వాత ఈ అరెస్టు జరిగింది, రాజస్థాన్, కర్ణాటక మరియు పూణే అంతటా బహుళ రాష్ట్రాల వేట తర్వాత బెంగళూరులో శెట్టి పట్టుబడ్డాడు..

🔺దేశంలో కొనసాగుతున్న కార్మిక సంఘాల సమ్మె.

కార్మికులపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సమ్మె..
కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని..
లేబర్ కోడ్స్‌ రద్దు చేయాలని కార్మిక సంఘాల డిమాండ్..
కార్మిక సంఘాల సమ్మెకు మద్దతు తెలిపిన వామపక్షాలు..

బుధవారం జరగనున్న దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకింగ్, రవాణా మరియు ఇతర ప్రభుత్వ రంగ సేవలు నిలిచిపోయాయి, ఈరోజు వేలాది మంది కార్మికులు భారత్ బంద్‌లో చేరారు. కేంద్రం ఇటీవల ఆమోదించిన చట్టాలు మరియు విధానాల కారణంగా ట్రేడ్ యూనియన్ కార్మికుల నిరసన వ్యక్తమైంది. సిమ్లాలో కార్మికులు, రైతులు, బ్యాంకు ఉద్యోగులు ర్యాలీ
కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా, హిమాచల్ ప్రదేశ్ అంతటా కార్మికులు జిల్లా, బ్లాక్ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో రాష్ట్ర రాజధాని సిమ్లాతో సహా అనేక ప్రాంతాల్లో ప్రజా సేవలు దాదాపుగా నిలిచిపోయాయని పలువురు తెలిపేరు..

🔺సింగరేణిపై సమ్మె ప్రభావం.
సమ్మెలో భాగంగా విధులు బహిష్కరించిన కార్మికులు
బొగ్గు గనుల దగ్గర కార్మిక సంఘాల నిరసన
తెలంగాణలోని బొగ్గు గనుల్లో నిలిచిన ఉత్పత్తి..నల్ల సూర్యులు సార్వత్రిక సమ్మెలో భాగస్వామ్యమయ్యారు. సింగరేణి వ్యాప్తంగా ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలోని 11 డివిజన్లలో ఉన్న బొగ్గు గనులు… ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న సుమారుగా 40,000మంది కార్మికులు సార్వత్రిక సమ్మెకు సై అంటూ… విధులకు గైర్హాజరయ్యారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో చేపట్టిన టోకెన్ సమ్మె తో బొగ్గు గనులన్నీ బోసిపోయాయి.

బొగ్గు ఉత్పత్తికి పెద్ద ఎత్తున ఆటంకం కలిగింది. ఒకరోజు సమ్మెతో 1.92 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగగా.. ఒకరోజు సమ్మె మూలంగా సింగరేణి సంస్థ సుమారుగా 76కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి కనిపించింది. దేశానికి వెలుగులను అందించే సింగరేణి బొగ్గు సంస్థలో ఒకరోజు టోకెన్ సమ్మె ఉత్పత్తికి నిజంగా పెద్ద ఎత్తున ఆటంకం కలిగించే పరిస్థితి ఎదురవడం యాజమాన్యం జీర్ణించుకోలేకపోతోంది. దేశవ్యాప్త సమ్మె (Nationwide strike) లో సింగరేణి బొగ్గు గని కార్మికులు పాల్గొనవద్దని పదేపదే యజమాన్యం చెప్పినా కార్మిక హక్కుల సాధన కోసం సమ్మె చేసి తీరుతామని కార్మిక సంఘాల పట్టుతో ఇక్కడ సింగరేణిలో సమ్మె పెద్ద ఎత్తున విజయవంతమైంది. సమ్మె ప్రభావంతో బొగ్గు రవాణా కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సింగరేణి బొగ్గు గనులు ఓపెన్ కాస్ట్లు అన్నీ కూడా నిర్మాణుష్యంగా కనిపించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సమ్మె సందర్భంగా పోలీసులు పెద్ద ఎత్తున గనుల పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు…

🔺చిత్తూరు: పలమనేరు దగ్గర పోలీసుల తనిఖీలు.
జగన్‌ పర్యటన నేపథ్యంలో వైసీపీ నేతల వాహనాల ఫోకస్
చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసులు
వైసీపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు.

🔺గుజరాత్: పద్రా దగ్గర మహిసాగర్ నదిపై కూలిన బ్రిడ్జి
బ్రిడ్జి కూలడంతో నదిలో పడిపోయిన 4 వాహనాలు..
నదిలో పడ్డ కొందరిని కాపాడిన సహాయక బృందాలు..
నదిలో మరికొందరు గల్లంతు, గాలిస్తున్న పోలీసులు..
వడోదర-ఆనంద్‌ పట్టణాల మధ్య రాకపోకలకు అంతరాయం…

గుజరాత్‌లోని వడోదరలో బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారం అందజేయాలని అధికారులను ఆదేశించారు. పద్రా దగ్గర మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి…పద్రా దగ్గర మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కూలిపోయింది. అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. నదిలో వాహనాలు పడిపోవడంతో 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే ముప్పు ఉంది..రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. రెస్క్యూ అపరేషన్ కొనసాగుతుంది. గల్లంతు అయిన వారి కోసం గాలిస్తున్నారు. ఇప్పటివరకు ఐదుగుర్ని కాపాడామని.. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. వడోదర – ఆనంద్ జిల్లాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి నిర్మించారు. ఇప్పుడు బ్రిడ్జి కూలడంతో ఆనంద్, వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. 1985లో నిర్మించిన ఈ వంతెన పాతబడడంతో పాటు.. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూలిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు..

అంతరిక్షంలో మెంతి, పెసర సాగు.., శుభాంశు శుక్లా

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వివిధ పరిశోధనలు చేస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తాజాగా రైతు అవతారం ఎత్తారు. రోదసిలో గురుత్వాకర్షణ లేని పరిస్థితుల్లో మెంతి, పెసర సాగుపై ఉండే ప్రభావాలపై అధ్యయనం ఆయన ఐఎస్‌ఎస్‌లో చేస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నపాటి గాజు పాత్రల్లో మెంతి, పెసర విత్తనాలను వేసి, ఐఎస్‌ఎస్‌లోని నిల్వ ఫ్రీజర్‌లో ఉంచారు. అనంతరం జీరో గ్రావిటీలో అవి ఏ విధంగా మొలకెత్తుతాయనే విషయాన్ని శుక్లా అధ్యయనం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తీశారు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సుధీర్ సిద్దపురెడ్డి, ధార్వాడ్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన రవికుమార్ హోసమణి అనే ఇద్దరు శాస్త్రవేత్తల సహాయంతో శుక్లా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. భూమిపైకి వచ్చాక ఆ మొలకలలో వచ్చిన జన్యుమార్పులు, పోషక విలువలను పరిశీలించనున్నట్లు ఆక్సియం స్పేస్ చెప్పింది. మరో ప్రయోగంలో మైక్రోఆల్గేలను అధ్యయనం చేశారు శుక్లా. వీటికి జీరో గ్రావిటీలో ఆహారం, ఆక్సిజన్‌, జీవ ఇంధనాలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని పరిశీలించారు.

విత్తనాలపై సూక్ష్మ గురుత్వాకర్షణ ప్రభావాన్ని అధ్యయనం చేయడం, స్టెమ్ సెల్ పరిశోధన, వ్యోమగాములు స్టేషన్‌లోని స్క్రీన్‌లతో సంభాషించేటప్పుడు సమాచారాన్ని విశ్లేషించే వారి మానసిక సామర్థ్యం వంటి విషయాలను గమనిస్తున్నానని శుక్లా తెలిపారు. ఈ విషయాలు తనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. పరిశోధకులకు, స్పేస్‌ స్టేషన్‌కు మధ్య వారధిగా ఉండి వివిధ పరిశోధనలు నిర్వహించడం గర్వంగా ఉందని శుక్లా అన్నారు.