న్యూస్ updates..

Live Update News.

నేటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన.. ఇవాళ సాయంత్రం పులివెందుల క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. రేపు ఉదయం ఇడుపులపాయలో క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలకు హాజరు.. సాయంత్రం భాకరాపురం క్యాంప్ ఆఫీసులో ప్రజాదర్బార్.. 25వ తేదీన ఉదయం సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు హాజరుకానున్న జగన్..

నేడు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు..

నేడు గ్రూప్-1 అప్పీల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. గ్రూప్-1 పరీక్షలను టీజీపీఎస్సీ సక్రమంగా నిర్వహించిందని తెలిపిన ఏజీ.. గ్రూప్-1పై సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ..

తెలంగాణను వణికిస్తున్న చలి.. హైదరాబాద్- ముంబై రహదారిని కమ్మేసిన పొగమంచు.. కనుచూపు మేర కనిపించని వాహనాలు.. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 4.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత.. తెలంగాణలో ఈ సీజన్‌లో ఇదే కనిష్ట ఉష్ణోగ్రత.. ఉదయం 8 గంటలు దాటేతే గానీ బయటకు రాలేని పరిస్థితి.. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు నిర్మానుష్యంగా కనిపిస్తున్న కోహిర్ రోడ్లు..

భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యలు..!

భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన యుద్ధాన్ని తానే ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాఖ్యానించారు. ఈ వివాదంలో ఎనిమిది విమానాలు కూడా కూల్చివేశారని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఎనిమిది యుద్ధాలు ఆపానని పేర్కొన్నారు. కానీ ఇప్పటివరకు తను పరిష్కరించలేకపోయిన ఏకైక యుద్ధం రష్యా-ఉక్రెయిన్ అని చెప్పారు. వాషింగ్టన్ డీసీలో విలేకరులతో సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.

‘నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను. థాయ్‌లాండ్-కంబోడియా మధ్య పరిస్థితి క్రమంగా సద్దుమణుగుతోంది. భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన అణు యుద్ధాన్ని మేం ఆపాం. పాకిస్థాన్ ప్రధాని ట్రంప్ 10 మిలియన్ల ప్రాణాలు కాపాడారని అన్నారు. కావచ్చు ఇంకా ఎక్కువే. ఆ యుద్ధంలో ఎనిమిది విమానాలు కూల్చివేయబడ్డాయి. పరిస్థితి కూడా తీవ్రంగా మారింది. కానీ ఆ వివాదాన్ని పరిష్కరించా. ఈ యుద్ధాలను ఆపడానికి వాణిజ్య సుంకాలను ఉపయోగించా. అమెరికా జోక్యంతో 24 గంటల్లోనే ముగిశాయి. కానీ ఇప్పటివరకు నేను పరిష్కరించలేకపోయిన ఏకైక యుద్ధం రష్యా-ఉక్రెయిన్’ అని ట్రంప్ పేర్కొన్నారు..

శంషాబాద్ ఎయిర్‌పోర్టు కు బాంబు బెదిరింపులు..!

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (శంషాబాద్ ఎయిర్‌పోర్టు) (Shamshabad Airport) తరచుగా బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం.. ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది తనిఖీలు చేయడం… చివరకు అది ఫేక్ బెదిరింపు అని తేలడం పరిపాటిగా మారిపోయింది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మరోసారి బాంబ్ బెదిరింపుల ఈమెయిల్ రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. తరచుగా వస్తున్న ఫేక్ బాంబ్ బెదిరింపు మెయిల్స్‌పై పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ ఏడాది ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్టుకే దాదాపు 28 సార్లు బాంబు బెదిరింపులు వచ్చాయి. వెంటనే అప్రమత్తమై అన్ని చెకింగ్స్ చేశాకా అది ఫేక్ మెయిల్స్‌గా భద్రత సిబ్బంది నిర్ధారించారు. ఇప్పటికే బాంబ్ బెదిరింపులపై ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్‌లో 28 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులపై లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. వీటిని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని ఆర్జీఐఏ పోలీసులు యోచిన్నట్లు తెలుస్తోంది..