Letest news..

ఢిల్లీ: నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభంకానున్న జనగణన.. సహజీవన జంటలకు సైతం కుటుంబ హోదా ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటన.. రెండు విడతల్లో జనగణన.. మొదటి విడతలో ఇళ్ల సర్వే.. రెండవ విడతలో జనాభా లెక్కింపు

భారీగా పెరిగిన కమర్షియల్‌ సిలిండర్‌ ధర.. 19 కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.195.50 పెంపు.. కోల్‌కతాలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌పై రూ.218 పెంపు.. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో నో ఛేంజ్‌

హైదరాబాద్‌: సాగర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్.. LPG గ్యాస్‌ కొరతతో ఆటో డ్రైవర్ల ఆందోళన.. సాగర్‌ రింగ్‌ రోడ్డులోని పెట్రో బంక్‌ వద్ద భారీగా నిలిచిన ఆటోలు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన LPG ఆటో డ్రైవర్లు

తిరుమల: 04 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,519 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 21,564 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.4.3 కోట్లు..

అమరావతి చట్టభద్దత బిల్లుకు లోక్ సభ ఆమోదం.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. వైసీపీ మినహా మిగిలిన పార్టీలు బిల్లుకు మద్దతు తెలిపాయి. అమరావతి బిల్లుపై చర్చలో 11 పార్టీలకు చెందిన 18 మంది ఎంపీలు పాల్గొన్నారు. అమరావతి బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. ఈరోజు(బుధవారం) ఉదయం అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన చర్చలో ఎంపీలు పాల్గొన్నారు. చర్చ తర్వాత అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ప్రకటించారు..

కేరళంలో లెఫ్ట్ ఫ్రంట్ పై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్

సీపీఐ, సీపీఎం పార్టీల లెఫ్ట్ ఫ్రంట్ కు ఓటు వేస్తే నరేంద్ర మోదీకి వేసినట్టే అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, నరేంద్ర మోదీకి నీడ లాంటి వాడు అని, వాళ్లిద్దరూ అన్నదమ్ముల లాంటివారు అని విచిత్ర వ్యాఖ్యలు..

ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి ఇళ్లు కూల్చిన అంశం మీద ఇటీవల విమర్శలు గుప్పించిన పినరయి విజయన్..

దీంతో కక్ష పెంచుకున్న రేవంత్ రెడ్డి..

రెండు రోజుల కేరళ ప్రచారంలో భాగంగా ఇవాళ సీపీఐ, సీపీఎం లెఫ్ట్ ఫ్రంట్‌ను టార్గెట్ చేసిన రేవంత్..

సీపీఐతో తెలంగాణలో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం నడుపుతున్నామన్న విషయం మర్చిపోయినట్లు నటిస్తున్న రేవంత్ రెడ్డి తీరు చూసి రాజకీయవర్గాల్లో విస్మయం..

అవకాశవాదానికి ఇది పరాకాష్ట అని పలువురి కామెంట్..

సొంత ప్రభుత్వంపై అనిరుధ్ రెడ్డి ఫైర్

కాంగ్రెస్ సర్కారుపై తీవ్ర ఆరోపణలు..డ్రగ్స్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అనిరుధ్ రెడ్డి

ప్రభుత్వంలో పైసా పేక్ తమాషా దేక్ నడుస్తుంది..పైసలు ఉన్నోడికి పనులు అవుతున్నాయి

అధికారుల నుంచి పై స్థాయి నేతల వరకు పైసలు లేనిదే, చేతులు తడపనిదే పని అవట్లేదు

పేదలు తమ పనుల కోసం 10 సార్లు తిరిగినా ఫలితం లేదు .. వారిని అసలు పట్టించుకోవట్లేదు

సినిమాలో పవన్ గుడుంబా తాగితే తప్పు కాదు కానీ నేను ఇప్ప సారా అంటే ట్రోల్ చేస్తున్నారు

సినిమా వాళ్లు గ్లాసులు పట్టుకుంటే హీరోలు.. రాజకీయ నాయకులు గ్లాసులు పట్టుకుంటే జీరోలా?

పది లక్షల ఇప్ప చెట్లు నాటాలని డిమాండ్ చేస్తున్న.. ఆ చెట్ల వల్ల అనేక లాభాలు ఉన్నాయి

స్టార్ హీరోలు ప్రతి 90 రోజులకు ఒకసారీ డ్రగ్‌ టెస్ట్‌లు చేయించుకొని అభిమానులకు చెప్పాలి

హీరోలకు డ్రగ్స్ టెస్ట్‌లో నెగటివ్ వస్తేనే వారి సినిమాను విడుదల చేయడానికి అనుమతించాలి.

చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినిమాలు విడుదల కావాలంటే డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాల్సిందే..

PACS సహకార సంఘం బ్యాంకులో మద్యం తాగుతూ పట్టుబడ్డ ఉద్యోగులు

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు PACS బ్యాంకులో, అర్ధరాత్రి చైర్మన్ ఛాంబర్లో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, దళారులతో కలిసి మద్యం సేవించిన ఉద్యోగులు.

బ్యాంకు ఉద్యోగులు దళారుల వద్ద లంచం తీసుకుని అర్ధరాత్రి లోన్లు మంజూరు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతులు..

తమిళనాడు సీఎం స్టాలిన్‌ కీలక వ్యాఖ్యలు.

ఎన్నికల్లో NDA గెలిస్తే తమిళనాడు పేరు మారుస్తారు.

దక్షిణ్ ప్రదేశ్‌గా పేరు మారుస్తారు-సీఎం స్టాలిన్..

2011, 2016 , 2021లో వరుసగా తాను గెలుపొందిన కొలత్తూరు నియోజకవర్గం నుంచి ఎంకే స్టాలిన్ తాజాగా మరోసారి నామినేషన్‌ను దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన తర్వాత, స్టాలిన్ కొంత సమయం రోడ్ షో నిర్వహించి, ప్రజలకు అభివాదం చేసారు. ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ కోలత్తూరు నియోజకవర్గంలో తాను సాధించిన విజయాలపై ఒక పుస్తకాన్ని కూడా విడుదల చేశారు..