న్యూజిలాండ్-అఫ్ఘానిస్తాన్ మ్యాచ్ రద్దు….

టీ20 ప్రపంచకప్ లో భాగంగా బుధవారం న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్‌ రద్దయింది. ఎడతెరిపిలేకుండా వర్షం కురవడంతో ఒక్క బంతి కూడా వేయకుండానే మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. దాంతో రెండు జట్ల ఒక్కో పాయింట్ లభించాయి. మెల్‌బోర్న్‌లో ఇంగండ్‌, ఐర్లాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌కు కూడా వర్షం అడ్డంకిగా నిలిచింది. అయితే ఆ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో ఐర్లాండ్‌ గెలిచింది…