NIA చేతికి పహల్గాం ఉగ్ర దాడి కేసు….

*NIA చేతికి పహల్గాం ఉగ్ర దాడి కేసు..*

పహల్గాం ఉగ్ర దాడి కేసును జమ్మూ కశ్మీర్ పోలీసుల నుంచి ఎన్ఐఏ అధికారికంగా తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించి విచారణను చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశంతో ఎన్ఐఏ కేసు విచారణను స్వీకరించింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనా స్థలంలో ఎన్ఐఏ బృందం ఆధారాలు సేకరిస్తోంది. ఈ బృందంలో ఉగ్రవాద వ్యతిరేక ఏజెన్సీకి చెందిన ఐజీ, డీఐజీ, ఎస్పీ ఉన్నారు. ఉగ్ర దాడిని చూసిన సాక్షులను అధికారులు ప్రశ్నించనున్నారు..