విడాకులకు నిహారిక దరఖాస్తు..

విడాకులకు నిహారిక దరఖాస్తు..

*హైదరాబాద్/ కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక విడాకులకు దరఖాస్తు చేసుకుంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో విభేదాల కారణంగా కొన్నాళ్లుగా ఆమె దూరంగా ఉంటోంది. హిందూ మ్యారేజ్ చట్టం ప్రకారం కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో తాజాగా ఆమె విడాకులకు దరఖాస్తు చేసింది. తమ పెళ్లి ఫొటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి నిహారిక చైతన్య తొలగించారు. దీంతో వీరి విడాకులు ఖాయమేనని గతంలో ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆ వార్తలు నిజమయ్యాయి.