నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు… ఏ పార్టీకి ఓటు వేసిన బిజెపికే పడుతుందంటూ వ్యాఖ్యలు..!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం మైనారిటీ ఏరియాలోఎంపీ అర్వింద్ మీడియా సమావేశం జరిగింది. 75 ఏళ్లలో మైనార్టీలకు కాంగ్రెస్ కానీ ఇతర పార్టీల వల్ల లాభం చేకూరలేదు. బిజెపి మాత్రమే మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిందన్నారు…

మీరు నోటాకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..
మీరు కారుకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..
మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినా నేనే గెలుస్తాను..

మీరు దేనికి ఓటు వేసినా ఓటు పడేది మాత్రం బీజేపీకే –

దేశవ్యాప్తంగా 3.5 కోట్ల ఇండ్లు ప్రధాని అవాస్ యోజన కింద పంపిణీ చేశామని తెలిపారు. ఇందులో 70 శాతం ముస్లిం మహిళలకె ఇచ్చాం. కేసీఆర్ నిర్లక్ష్యం, అవినీతి వల్లే తెలంగాణలో నిర్మాణాలు చేపట్టలేదన్నారు. కేసీఆర్ కావాలనే తెలంగాణలో అవాస్ యోజన అమలు చేయలేదు..కోవిడ్ సమయంలో ముస్లింలకు చికిత్సతో పాటు భీమా కల్పించాం అని వెల్లడించారు. ఆయుష్మన్ భారత్ ఆమలు చేయకుండా కేసీఆర్ మైనార్టీలకు అన్యాయం చేసారు.
మిగతా రాష్ట్రాల్లో ముస్లిం మైనార్టీలకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు. మోడీ ఆలోచన విధానం వల్ల ముస్లింలు బిజెపికి ఓట్లు వేస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ కావాలనే ముస్లింలను కేంద్ర పథకాలకు దూరం చేస్తున్నారు. దళితబందు 50 శాతం మందికి కూడా అందలేదు అన్నారు…