నీలం మధు ముదిరాజ్ బీఎస్పీలో చేరిక…!

*నీలిరంగు గుటికి నీలం మధు*

తెలంగాణలోని పటాన్ చెరు రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాల మధ్య నీలం మధు ముదిరాజ్ బీఎస్పీలో చేరారు.

శుక్రవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కండువా కప్పి ఆహ్వానించారు.

కాగా, నీలం మధుకు పటాన్ చెరుకు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అభ్యర్థిని మార్చింది.

దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన మధు.. అనూహ్యంగా ఇవాళ బీఎస్పీ తీర్థం పుచ్చుకున్నారు.

కాసేపట్లో బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు.