నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు..!

నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు..

జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖానాపూర్ పట్టణంలోని శివాజీ నగర్‌లో పట్టపగలే నడిరోడ్డుపై యువతి హత్యకు గురైంది. అలేఖ్య అనే యువతిని ఆమె ప్రియుడు శ్రీకాంత్.. గొడ్డలితో నరికి చంపాడు. యువతి టైలరింగ్‌కు వెళ్లి వస్తుండగా నిందితుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మృతురాలి సోదరి జయ, రియాన్స్ అనే బాలుడికీ తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.