నీట్​ పరీక్ష కు హాజరైన విద్యార్థినిలకు షాక్… లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్‌లోకి అనుమతి ఇస్తామన్న సిబ్బంది.!!!.

నీట్‌ పరీక్ష రాసేందుకు ఎంతో కాలం కష‍్టపడి చదువుతుంటారు విద్యార్థులు. వైద్యులు కావాలని కలలు కనేవారు ఈ పరీక్ష కోసమే ఏళ్ల తరబడి కూడా ఎదురు చూస్తుంటారు. అయితే నీట్​ 2022 నేపథ్యంలో కేరళలో షాకింగ్​ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం కేరళవ్యాప్తంగా నీట్​ పరీక్ష జరగ్గా.. కొల్లం ప్రాంతంలోని ఓ సెంటర్​లో విద్యార్థినులకు చేదు అనుభవం ఎదురైంది. సెక్యూరిటీ చెకింగ్​ వద్ద మెటల్​ డిటెక్టర్​ మోగడంతో.. వారు వేసుకున్న ‘బ్రా’ను తొలగించాలని అక్కడి సిబ్బంది ఆదేశించారు. అలా చేయకపోతే.. పరీక్ష రాయనివ్వమని తేల్చిచెప్పారు.. లోదుస్తులు తీసేస్తేనే పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని సిబ్బంది తేల్చి చెప్పారట. లేకపోతే పరీక్ష రాయొద్దని అన్నారట. ఈ నిబంధన వల్ల తన కూతురు తీవ్ర మానసిక క్షోభ అనుభవించిందని ఓ విద్యార్థిని తండ్రి గోపకుమార్ సూరానంద్ తెలిపారు. ఈ విషయంపై కొల్లం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు..