నిర్మాతగా నితిన్ సూపర్ సక్సెస్..!!

తెలుగులో స్టార్ హీరో రేంజ్ పాపులారిటీ ఉన్న ఆయన క్రేజ్ తగ్గిపోయింది. కమల్ మార్కెట్ తెలుగులో పడిపోయింది. ఈ క్రమంలో విక్రమ్ హక్కులకు పెద్దగా పోటీ ఏర్పడలేదు. అయితే కాంబినేషన్ రీత్యా సినిమా హిట్ కొడుతుందనే నమ్మకం మాత్రం ట్రేడ్ వర్గాల్లో ఉంది. దర్శకుడు లోకేష్ కనకరాజ్ హిట్ ట్రాక్, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి నటులు, కమల్ మూవీలో నటించడం వంటి సానుకూల అంశాలు ప్రయోజనం చేకూర్చాయి…విక్రమ్ తెలుగు హక్కులు రూ. 7-8 కోట్లకు నితిన్ దక్కించుకున్నారు. కాగా మూడు రోజుల్లోనే విక్రమ్ బ్రేక్ ఈవెన్ కి దగ్గరైంది. ఫస్ట్ షో నుండే ట్రెమండస్ టాక్ సొంతం చేసుకున్న విక్రమ్ రోజురోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ పోయింది. ఏపీ/తెలంగాణాలలో కలిపి ఫస్ట్ డే రూ. 1.6 కోట్లు, సెకండ్ డే రూ.1.85 కోట్లు, థర్డ్ డే రూ. 2.06 కోట్ల షేర్ అందుకుంది. వర్కింగ్ డే సోమవారం కూడా విక్రమ్ జోరు తగ్గలేదు. రూ.1.32 కోట్ల షేర్ తో సత్తా చాటింది. నాలుగు రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ రూ. 6.83 కోట్లు షేర్, అలాగే రూ. 13 కోట్ల గ్రాస్ వసూలు చేసింది…
నిర్మాతగా నితిన్ సూపర్ సక్సెస్ అంటున్నారు. విక్రమ్ హక్కులు కొనాలన్న ఆలోచన ఆయనకు భారీ లాభాలు తెచ్చిపెట్టనుంది. నితిన్ (Nithin)తో పాటు మరికొందరు పార్టనర్స్ గా ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు హీరోగా నితిన్ కెరీర్ నెమ్మదించింది. భీష్మ తర్వాత ఆయనకు వరుస ప్లాప్స్ పడ్డాయి. చెక్, రంగ్ దే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఇక బాలీవుడ్ రీమేక్ మ్యాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఈ మూవీకి కూడా అనుకున్నంత ఆదరణ దక్కలేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా మాచర్ల నియోజకవర్గం పేరుతో ఓ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రంపైనే నితిన్ ఆశలు పెట్టుకున్నాడు..