బాగుంది రా మామా..నితీష్ కుమార్ రెడ్డితో తెలుగులో మాట్లాడిన గిల్..!

బాగుందిరా మావ”..నితీష్ కుమార్ రెడ్డితో తెలుగులో మాట్లాడిన గిల్.

మూడో టెస్టును ఇంగ్లండ్‌ నెమ్మదిగా ఆరంభించింది…

మూడో టెస్ట్‌లో మొదటి రోజు లార్డ్స్‌లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. అయితే నితీష్‌ సూపర్‌ బౌలింగ్‌ వేస్తే…

పూర్తి ఎండకాచిన పిచ్‌పై భారత పేసర్లు ఆతిథ్య జట్టు బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి బెన్‌ స్టోక్స్‌ సేన.. 83 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. జో రూట్‌ (191 బంతుల్లో 99 నాటౌట్‌, 9 ఫోర్లు) శతకానికి ఒక్క పరుగుదూరంలో నిలవగా, ఒలీ పోప్‌ (104 బంతుల్లో 44, 4 ఫోర్లు), కెప్టెన్‌ స్టోక్స్‌ (39 నాటౌట్‌, 3 ఫోర్లు) ఆ జట్టును ఆదుకున్నారు. భారత బౌలర్లలో తెలుగు కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (2/46) రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా (1/26), జస్‌ప్రీత్‌ బుమ్రా (1/35) తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

నితీశ్‌ డబుల్‌ ట్రబుల్‌
లార్డ్స్‌లో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌.. తన సహజసిద్ధమైన ఆటకు పూర్తి విభిన్నంగా ఆడింది. ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే ఓపెనింగ్‌ ద్వయం జాక్‌ క్రాలీ (18), బెన్‌ డకెట్‌ (23) ఆచితూచి బ్యాటింగ్‌ చేశారు. వికెట్‌కు రెండువైపులా స్వింగ్‌ లభించడంతో భారత పేసర్లు కట్టుదిట్టంగా బంతులేశారు. ఆకాశ్‌ దీప్‌ 8వ ఓవర్లో క్రాలీ రెండు బౌండరీలు రాబట్టినా ఆ తర్వాత మళ్లీ స్కోరు వేగం పుంజుకోలేదు. డ్రింక్స్‌ విరామం తర్వాత గిల్‌.. నితీశ్‌కు బంతినివ్వగా అతడు సారథి నమ్మకాన్ని నిలబెడుతూ ఒకే ఓవర్లో ఆతిథ్య జట్టుకు డబుల్‌ షాకులిచ్చాడు. మొదట నితీశ్‌ వేసిన షాట్‌ బాల్‌ను లెగ్‌ సైడ్‌ ఆడబోయిన డకెట్‌.. వికెట్ల వెనుకాల పంత్‌కు చిక్కాడు. మరో రెండు బంతుల తర్వాత క్రాలీ కూడా పంత్‌కే క్యాచ్‌ ఇవ్వడంతో ఇంగ్లీష్‌ జట్టు రెండో వికెట్‌ కోల్పోయింది. తొలి సెషన్‌లో ఆ జట్టు 25 ఓవర్లలో చేసింది 3.32 సగటుతో 83 పరుగులే…

కెప్టెన్‌ గిల్‌ వైరల్‌ అవుతున్నాడు. అదేంటి.. అనుకుంటున్నారా? అందుకు కారణం గిల్‌ నితీస్‌ను ప్రశంసించడమే. అది కూడా తెలుగులో..

నితీష్‌ కుమార్‌ రెడ్డి తన తొలి ఓవర్లోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీలను అవుట్ చేసి, తన కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్ తో ఇతర బ్యాటర్లను పెవిలియన్‌ చేర్చాడు. అయితే నితీష్‌ కుమార్‌ రెడ్డి ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌ వేస్తుండగా.. ఇంగ్లాండ్‌ సీనియర్‌ బ్యాటర్‌ జో రూట్‌కు ఒక సూపర్‌ డెలవరీ వేశాడు. దాంతో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గిల్‌.. “బాగుంది రా మామ” అంటూ తెలుగులో గట్టిగా అరిచాడు. అది కాస్త స్టంప్‌ మైక్‌లో రికార్డ్‌ అయింది. కామెంటేటర్లు సైతం.. గిల్‌కు నితీష్‌ తెలుగు బాగా నేర్పించాడంటూ నవ్వుకున్నారు. అయితే ఈ సంఘటనతో ఆటగాళ్ల మధ్య ఎంత మంచి బాండింగ్‌ ఉందనే విషయం స్పష్టం అవుతోంది..

https://x.com/StarSportsTel/status/1943272988130054146?t=a6QuveeMHQLZ6OJbUtH15Q&s=19

https://x.com/StarSportsTel/status/1943280595649597794?t=Ot6kM8qTzBxOa_ZRzRp5ZQ&s=19

బ్రేక్‌ ఇచ్చిన జడ్డూ..
రెండో సెషన్‌ అనంతరం వేసిన మొదటి ఓవర్‌లోనే జడేజా.. పోప్‌ను ఔట్‌ చేసి 109 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. హ్యారీ బ్రూక్‌ (11) రెండు బౌండరీలతో జోరు కనబరిచినా బుమ్రా వేసిన మ్యాజికల్‌ డెలివరీకి క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. బ్రూక్‌ స్థానంలో వచ్చిన సారథి స్టోక్స్‌.. రూట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే బాధ్యతను భుజానికెత్తుకున్నాడు. ఈ ఇద్దరూ మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తపడ్డారు. చివరి సెషన్‌లో కాస్త జోరు పెంచిన ఈ జోడీ.. అజేయమైన ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించింది.

సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:
83 ఓవర్లలో 251/4
(రూట్‌ 99*, పోప్‌ 44,
నితీశ్‌ 2/46,
జడేజా 1/26)