కొత్త తరహాలో మత్తు..చిత్తు అవుతున్న యువత..

*🔹 మత్తు కోసం యువత కొత్త ఎత్తులు వేస్తూ చిత్తవుతోంది. సంప్రదాయ మత్తు పదార్థాలు అందుబాటులో లేనివారు ఇతర ప్రమాదకరమైన పదార్థాలను వినియోగిస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు..

 *ఎలాంటి మెడికల్ ప్రిస్క్రిప్ లేకుండా మత్తు కోసం “స్పాస్మో ప్రాక్సివాన్ ప్లస్ మరియు అల్ట్రా కింగ్ టాబ్లెట్‌లు, ట్రామాడెక్స్ ఇంజెక్షన్‌లు” విక్రయిస్తున్నమెడికల్ షాప్ యజమానితో సహ ఇద్దరు యువకుల అరెస్ట్..

*• జిల్లా ఎస్పీ చందనా దీప్తి IPS.*

తెలంగాణ రాష్ర్ట౦ ప్రతిష్టాత్మికంగా తీసుకొన్న మాదకద్రవ్యాల నిర్మూలన లో భాగ౦గా, తెలంగాణ రాష్ర్ట డి.జి.పి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా మరియు గంజాయి,మాదకద్రవ్యాల మత్తు పదార్ధాల అక్రమ రవాణా పై ఉక్కుపాదం మోపి నిరంతర నిఘా లో బాగంగా ఈ రోజు నమ్మదగిన సమాచారం మేరకు 1 టౌన్ పోలీసులు & టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సంయుక్తంగా ఈ రోజు తెల్లవారుజామున, ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్, అల్ట్రా కింగ్ మరియు ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు కలిగివున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు జబీయుల్లా, ఎండీ సల్మాన్ లు ఈ మాత్రలను ఇంజక్షన్‌లు అలవాటుగా గత 3 సంవత్సరాల నుండి, మత్తు అనుభూతిని పొందడానికి రోజుకు కొన్ని ఎక్కువ మోతాదులో సేవిస్తున్నామని, వీరు నల్గొండలోని శివాజీ నగర్ లోని న్యూ హెల్త్ కేర్ ఫార్మసీకి చెందిన తౌడోజు నరేష్ ప్రొప్రైటర్, వద్ద ఎలాంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్‌లు మరియు ఇంజెక్షన్‌లను తీసుకొని వీరు సేవిస్తూ మరియు ఎవ్వరికీ డౌట్ రాకుండా సిగరెట్ పెట్టలో పెట్టి బయట వ్యక్తులకు ఎక్కువ దరకు విక్రయించడం కూడా జరుగుతుంది.

*వీరి వద్ద నుండి స్వాదీనము పరుచుకున్నవి* .
1.స్పాస్మో ప్రాక్సివోన్ ప్లస్ టాబ్లెట్స్ 4032,
2.అల్ట్రా కింగ్ టాబ్లెట్స్ 585,
3.ట్రామాడెక్స్ ఇంజెక్షన్లు టాబ్లెట్స్ 300 స్వాదీనము చేసుకోవడం జరిగింది.

*అరెస్టయిన నేరస్థుల వివరాలు* :-
(1) Md. మహమ్మద్ జబీ ఉల్లా, S/o హఫీజ్ ఉల్లా, రెహ్మాన్ బాగ్, నల్గొండ.
(2) తౌడోజు నరేష్ S/O కృష్ణమూర్తి,మెడికల్ షాప్ యజమాని, మన్యంచల్క, మిర్యాలగూడ రోడ్డు, నల్గొండ పట్టణం,.
(3) మహ్మద్ సల్మాన్ S/O ఉస్మాన్, వయస్సు: 24 సంవత్సరాలు, కులం: ముస్లిం, విద్యార్థి డిగ్రీని నిలిపివేసారు, R/O రోడ్ నెం.5, శ్రీనగర్ కాలనీ, NG కళాశాల వెనుక వైపు, హైదరాబాద్ రోడ్, నల్గొండ డిస్ట్రక్ట్.