నోమోఫోబియా ప్రతి నలుగురిలో ముగ్గురు ఎదుర్కొంటున్న ఈ సమస్య..!! ఈ సమస్య మీకు కూడా ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి..!

నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్‌ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్‌(YouGov) 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు…

ప్రతి నలుగురిలో ముగ్గురు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి?..

Nomophobia | నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్‌ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్‌(YouGov ) 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.

ప్రతి నలుగురిలో ముగ్గురు ఎదుర్కొంటున్న ఈ సమస్య ఎందుకు వస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి?
Nomophobia | ఒక్క క్షణం ఫోన్‌ కనిపించకపోతే కావాల్సినవాళ్లు దూరమైనంత కంగారు! మొబైల్‌ సిగ్నల్‌ పోతే మనసులో తెలియని గుబులు! మొబైల్‌లో లో- బ్యాటరీ అని అలర్ట్‌ వస్తే ప్రాణాలు పోతున్నాయన్నంత ఆందోళన! ఛార్జింగ్‌ ఒక్కో పాయింట్‌ తగ్గుతున్నాకొద్దీ గుండెల్లో దడ పెరిగిపోవడం ! మనలో చాలామంది ఎప్పుడో ఒకప్పుడు ఈ ఫీలింగ్‌ ఎదుర్కొనే ఉంటాం. ఇది మేము మీరే కాదు ప్రతి నలుగురిలో ముగ్గురు ఎదుర్కొంటున్న సమస్య! దానిపేరే నోమోఫోబియా!! అసలేంటి ఈ ఫోబియా? ఇది ఎందుకు వస్తుంది? దీని నుంచి ఎలా బయటపడాలి..?

నోమోఫోబియా అంటే ఏంటి?
మొబైల్‌కు ఎక్కడ దూరంగా ఉండాల్సి వస్తుందేమోనన్న భయాన్నే నోమోఫోబియా అని పిలుస్తారు. నో( NO ) మొబైల్‌ ( MO ) ఫోన్‌ ( PHO) ఫోబియా (BIA) అనే పరిస్థితి నుంచే NOMOPHOBIA అనే పదం వచ్చింది. ఇదొక రకమైన మానసిక సమస్యగా చెప్పొచ్చు.

ప్రతి నలుగురిలో ముగ్గురికీ ఇదే సమస్య
నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్‌ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్‌(YouGov ) 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ఇప్పటికీ నోమోఫోబియాతో బాధపడేవాళ్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రతి నలుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారని ఒప్పో ఇండియా, కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది.

నోమోఫోబియాకు కారణమేంటి?
ఒకప్పుడు మొబైల్‌ను కాల్స్‌ మాట్లాడేందుకు మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి పనిలోనూ స్మార్ట్‌ఫోన్‌ భాగమైపోయింది. ఏ చిన్న పనికి అయినా సరే మొబైల్‌ తప్పనిసరి అన్నట్లుగా మారింది. దీనికితోడు గేమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ చాలామంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దానికి బానిసగా మారిపోతున్నారు. అందుకే ఫోన్‌ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్‌ దూరమైతే తమ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినట్లుగా కంగారు పడిపోతున్నారు.

ఎలా గుర్తించాలి?
మనకు నోమోఫొబియా లక్షణాలు ఉన్నాయో లేదో సులువుగానే గుర్తించవచ్చు. ఫోన్‌ను కొద్దిసేపు ఆఫ్ చేయడానికి కూడా ఇబ్బంది పడటం.. ఒకవేళ పక్కనబెట్టినా లేదా జేబులో పెట్టుకున్నా సరే మిస్‌డ్‌కాల్స్‌, మెసేజెస్‌ ఏమైనా వచ్చాయా? అని మాటిమాటికి ఫోన్‌ తీసుకుని చూసుకోవడం.. నెట్‌వర్క్‌ లేకపోయినా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయినా కంగారుపడిపోవడం.. బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ ఎక్కడ స్విచ్ఛాఫ్‌ అయిపోతుందో అని ఆందోళన చెందడం.. బ్యాటరీ ఒక్క పాయింట్ తగ్గినా టెన్షన్‌ పడిపోయి ఛార్జింగ్‌ పెట్టడం.. వీటిలో ఏ సమస్య అనిపించినా భావోద్వేగానికి గురికావడం, కంగారు పడటం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలుగానే చెప్పొచ్చు.

లక్షణాలు
ఎప్పుడూ విచారంగా ఉండటం, ఎవరినో కోల్పోయినట్లుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అనిపించడం, అభద్రతాభావం, ఇతర పనుల మీద ఫోకస్‌ చేయలేకపోవడం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలే.

దీని నుంచి ఎలా నియంత్రించుకోవాలి?
గంటలకొద్దీ మొబైల్‌ ఫోన్‌ను వినియోగించకుండా స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. రోజులో ఇంత సమయం మాత్రమే ఫోన్‌ను వాడాలని కచ్చితమైన టైమ్‌ లిమిట్‌ను సెట్‌ చేసుకోండి. ఆ పరిధిలోనే స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించండి.

కొంతమంది రాత్రి పడుకున్న తర్వాత కూడా ఏదైనా నోటిఫికేషన్‌ వస్తే లేచి మొబైల్‌ చూస్తుంటారు. ఈ అలవాటును మానుకోవాలి. దీనికోసం మొబైల్‌లోని నైట్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. లేదంటే నోటిఫికేషన్స్‌ను సైలెంట్‌లో ఉంచుకోవాలి