కరోనా కు చెక్ పెట్టేందుకు ముక్కులో వేసుకొనే చుక్కల మందు విజయవంతంగా పూర్తి….

R9TELUGUNEWS.COM… కరోనా వైరస్‌కు సంబంధించి భారత్ బయోటెక్‌ రూపొందించిన ముక్కులో వేసుకొనే చుక్కల మందు (నాజల్‌ డ్రాప్స్‌) 3వ దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి అనుమతి లభించింది. ఇప్పటికే ఒకటి, రెండు దశల క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన భారత్‌ బయోటెక్‌.. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ కోసం భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ)కి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది.