నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు…!

రాజమండ్రి :.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో రాజమండ్రిలోని సెంట్రల్‌ జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. ఆయన రిమాండ్‌ గురువారంతో ముగియడంతో సీఐడీ అధికారులు వర్చువల్‌గా జడ్జి ముందు హాజరుపరిచారు.

నేడు 47వ రోజుకు చేరిన రాజమండ్రి సెంట్రల్ జైలులోని టిడిపి అధినేత చంద్రబాబు రిమాండ్.

స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన అరెస్టయిన చంద్రబాబు.

నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు…
జ్యుడీషియల్‌ కస్టడీని నవంబర్‌ ఒకటి వరకు పొడిగిస్తున్నట్టు న్యాయస్థానం వెల్లడించింది. ఈ సందర్భంగా చంద్రబాబు.. జైలులో తన భద్రత విషయంలో అనుమానాలున్నాయని జడ్జి దృష్టికి తీసుకొచ్చారు. అనుమానాలను రాతపూర్వకంగా ఇవ్వాలని జడ్జి సూచించారు…