బీఆర్ఎస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సుపై ఎన్ఎస్‌యూఐ కార్యకర్తలు కోడిగుడ్ల దాడి..!

కృష్ణా నది ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ తలపెట్టిన చలో నల్లగొండ బహిరంగ సభ ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. నల్గొండ జిల్లా వీటీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. సభకు వెళ్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల బస్సుపై దాడి జరిగింది. బస్సుపైకి కోడిగుడ్లు విసిరి ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారుఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు నల్లచొక్కాలు వేసుకుని నిరసనలు తెలియజేశారు. గో బ్యాక్ అంటూ బస్సు అద్దాలపై కోడిగుడ్లు విసిరారు. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు.
ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు…
అయినా వారు పోలీసు వలయాన్ని ఛేదించుకుని మరీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ బస్సుకు అడ్డంగా నిలుచున్నారు. బీఆర్ఎస్ నేతలు వెనక్కు వెళ్లాలంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జి చేయాల్సి వచ్చింది. నల్లగొండ సభకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరిన సంగతి తెలిసిందే.