సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్‌ ఎంతో ప్రత్యేకం: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము…

భారతీయ సినిమా చరిత్రలో నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) ఎంతో ప్రత్యేకమని రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారని రాష్ట్రపతి ద్రౌపదీముర్ము అన్నారు. కృష్ణుడు, రాముడు వంటి పాత్రల్లో ఆయన నటన అద్భుతమని కొనియాడారు. ఎన్టీఆర్‌ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని సాంస్కృతిక కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, తెదేపా అధినేత చంద్రబాబు, భాజపా ఏపీ అధ్యక్షురాలు, ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి, ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు హాజరయ్యారు.*