ఎన్టీఆర్ జిల్లాలో కూలిన వంతెన తెలుగు రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు..!

ఎన్టీఆర్ జిల్లాలో మోరీ వంతెన కుప్పకూలిపోవడంతో తెలుగు రాష్ట్రాల మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై మోరి వంతెన కుప్పకూలింది. దీంతో ఆంధ్ర, తెలంగాణలోని పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. కాలినడకన కూడా వెళ్లేందుకు వీలు లేకపోవడంతో జనాలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అధిక లోడుతో నిత్యం ఈ రోడ్డు ద్వారా వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.

ఈ మార్గంలో ఓవర్ లోడ్‌తో ఇసుక లారీలు, టిప్పర్‌లు తిరగడం వల్ల రహదారి పూర్తిగా ధ్వంసమైంది. మోరి వంతెన కూలిపోయే స్థితిలో ఉన్నా అధికారులు దీనిపై దృష్టిసారించలేదని, అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల రాకపోకలు వల్ల కూలిపోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. వెంటనే రహదారికి మరమ్మతులు చేసి వాహనాల ప్రయాణానికి సౌకర్యాలు కల్పించాలని వారు కోరుతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, కనీసం వాటిని పట్టించుకునే పాపాన పోలేదని మండిపడుతున్నారు.

ఎన్టీఆర్ జిల్లాలో వంతెన కూలిపోవటంతో తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మెట్టగుట్ట రోడ్డులో ఆర్ అండ్ బీ ప్రధాన రహదారిపై ఉన్న మోరీ వంతెన కుప్ప కూలింది. దీంతో వాహన రాక పోకలకు తీవ్ర అసౌకర్యం నెలకొంది. కాలినడకన వెళ్ళే వీలు కూడా లేక పోవటంతో కాలినడకన వెళ్ళే పాదచారులు కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.