స్కాట్లాండ్ వికెట్‌కీపర్‌ మాథ్యూ క్రాస్ నోటి వెంట భారత్‌ పేరు..కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది…

న్యూజిలాండ్ వర్సెస్ స్కాట్లాండ్ ఆడుతున్న సమయంలో సరదా సనివేశం ఒకటీ చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..కివీస్ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్కాట్లాండ్ వికెట్‌కీపర్‌ మాథ్యూ క్రాస్ నోటి వెంట భారత్‌ పేరు రావడం. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో క్రిస్ గ్రీవ్స్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్ బ్యాటింగ్‌ చేశాడు. తమ జట్టు ఆటగాళ్లలో ఉత్సాహాం నింపడం కోసం ‘కమాన్.. ఇండియా మొత్తం మన వెంట ఉంది’ అని మాథ్యూ క్రాస్ అన్నాడు. ఈ మాటలు వికెట్లలో ఉండే మైక్‌లలో రికార్డయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కొంతమంది ట్విటర్‌లో పోస్టు చేస్తూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు…అయితే, స్కాట్లాండ్ వికెట్ కీపర్ అలా మాట్లాడటానికి ఓ కారణం ఉంది. ఈ టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జట్లతో జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ఓటమిపాలైంది. దీంతో సెమీస్‌ రేసు నుంచి దాదాపుగా నిష్క్రమించినా సాంకేతికంగా మాత్రం భారత్‌కు ఇంకా సెమీస్ చేరే అవకాశం ఉంది. అది ఎలాగంటే.. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో టీమిండియా భారీ తేడాతో గెలవడంతోపాటు స్కాట్లాండ్ చేతిలో న్యూజిలాండ్‌ ఓడిపోవాలి. ఈ కారణంగానే స్కాట్లాండ్ వికెట్ కీపర్‌ ఆ విధంగా మాట్లాడాడు. అయితే, ఈ మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 16 పరుగుల తేడాతో ఓడింది.