దక్షిణాఫ్రికా నాలుగో విజయం…

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది..
పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. పూణే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 190 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 35.3 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది.

కివీస్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్ (60 ; 50 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. విల్ యంగ్ (33), డారిల్ మిచెల్ (24) లు రాణించారు. డేవాన్ కాన్వే (2), రచిన్ రవీంద్ర (9), కెప్టెన్ టామ్ లాథమ్ (4), మిచెల్ సాంటర్న్ (7) లు విఫలం అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. మార్కో జాన్సెన్ మూడు, గెరాల్డ్ కోయెట్జీ రెండు, రబాడ ఓ వికెట్ తీశాడు..

రెండో వికెట్‌కు 200 పరుగులు..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది దక్షిణాఫ్రికా. డికాక్ నెమ్మదిగా ఆడగా కెప్టెన్ బవుమా బౌండరీలు బాదాడు. అయితే.. అతడిని బౌల్డ్ ఔట్ చేయడంతో 38 పరుగుల వద్ద సౌతాఫ్రికా మొదటి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన డసెన్‌తో జతకట్టిన డికాక్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకువెళ్లాడు. వీళ్లు ఇద్దరు బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో 103 బంతుల్లో సెంచరీ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో డికాక్‌కు ఇది నాలుగో శతకం కావడం గమనార్హం.

200 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి మంచి ఊపుమీదున్న డికాక్, డసెన్ జోడిని డికాక్‌ను ఔట్ చేయడం ద్వారా సౌతీ విడగొట్టాడు. కొద్ది సేపటికే డసెన్ 101 బంతుల్లో మూడు అంకెల స్కోరు అందుకున్నాడు. మరికాసేపటికే అతడు పెవిలియన్‌కు చేరుకున్నాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకున్న మిల్లర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.