19న తులా రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి.. మారో రెండు రాశుల వారికి కూడా..!

19న తులా రాశిలో నాలుగు గ్రహాలు కలవనున్నాయి. ప్రతిగ్రహం ఒక నిర్దిష్ట కాలంలో ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. అలాంటి పరిస్థితిలో చాలాసార్లు ఒకే రాశిలో ఒకటి కంటే ఎక్కువ గ్రహాల శుభ కలయిక ఏర్పడుతుంది…ఇప్పుడు తులారాశిలో ఒకటి కాదు, రెండు కాదు, నాలుగు గ్రహాలు కలవనున్నాయి. కుజుడు అక్టోబర్ 3, 2023 కన్యరాశిని వీడి తులా రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే ఈ రాశిలో కేతు గ్రహం ఉంది. ఇప్పుడు అక్టోబర్ 18న గ్రహాల రాజు సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మరుసటి రోజు అంటే అక్టోబరు 19 న బుధుడు కూడా తులా రాశిలోకి ప్రవేశిస్తాడు. అక్టోబర్ 19 నుంచి తులా రాశిలో కుజుడు కేతువు సూర్యుడు బుధ గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఈ కలయిక ఏయే రాశుల వారికి ప్రయోజనంగా ఉంటుంది…
కర్కాటక రాశి

తులా రాశిలో ఏర్పడు ఈ నాలుగు గ్రహాల కలయిక కర్కాటక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ కాలంలో కర్కాటక రాశి జాతకులు ఆర్థిక పురోగతిని పొందుతారు. మీ ప్రాజెక్టులు ఏవైనా నిలిచిపోతే ఈ సమయంలో అవి కూడా పూర్తవుతాయి. నాలుగు గ్రహాల కలయిక ప్రభావం కర్కాటక రాశి వారి జీవితాల్లో సానుకూలతను తెస్తుంది. ఈ సమయంలో అదృష్టం మీ తోడుంటుంది.

సింహరాశి

తులా రాశిలో నాలుగు గ్రహాల కలయిక సింహ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ జీవితంలో సానుకూల మార్పులను చూస్తారు. మీరు వ్యాపారం చేస్తున్నట్టైతే మీకు లాభాలు ఎక్కువగా ఉంటాయి. నాలుగు గ్రహాల ప్రభావం మీ ఆదాయాన్ని పెంచుతుంది. కెరీర్‌కు సంబంధించిన కొత్త అవకాశాలను కూడా పొందుతారు.