ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు…

ఆంధ్ర తెలంగాణ:జులై 11
ఏ ఓ బి లోని గంపకొండఅటవీ ప్రాంతంలో మావోయిస్టు దాచి ఉంచిన డంపును మంగళవారం గుర్తించిన పోలీసులు మావోయిస్టుల కోసం కలిమెలా పోలీస్ స్టేషన్ పరిధిలోని బొడిగట్ట పంచాయతీ మరిగట్ట వద్ద గాలింపులు నిర్వహించిన BSF పోలీసులు భారీ డంపు స్వాధీనం చేసుకున్నారు.ఈ డంపులో ఎలక్ట్రిక్ డిటోనేటర్లు 25, సేఫ్టీ ఫ్యూజ్ నాలుగు బండిల్స్, 108 జిలేటెన్ స్టిక్స్, 20 హ్యాండ్ గ్రైనేడ్లు ఉన్నాయి. మావోయిస్టుల సింథటిక్ బెల్ట్లు 20, మావోయిస్టుల ర్యాంక్ ని సూచించే నక్షత్రాలు తొమ్మిది జతలు, విజిల్స్ 9 జతలు, కాస్ట్ ఐరన్ హ్యాండ్ ప్రస్ మిషన్ ఉన్నాయి…