ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం….

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఆదేశాలతో కేబినెట్ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. రేపు కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. జనతా దళ్ ప్రభుత్వానికి అయిదో సారి మూడేళ్లు నిండాయి. 2024 జనరల్ ఎలక్షన్ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంలో భాగంగా సీఎం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మంత్రులందరూ రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ మేరకు 20 మంది మంత్రులు తమ రాజీనామా పత్రాలను స్పీకర్ కు అందజేశారు. అనంతరం కాసేపటికే స్పీకర్​ సూర్యనారాయణ పాత్రో సైతం తన స్పీకర్​ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయనకు మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.