బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో బాగుపడ్డారు.… అందుకే మోటర్లకు మీటర్లు పెట్టనివ్వలేదు! సిఎం కేసీఆర్ పై , ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రశంసలు..!

తెలంగాణపై విమర్శలు గుపించే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కేసీఆర్ పాలన బాగుందంటూ కితాబిచ్చారు.
R9TELUGUNEWS.COM.
ఒకప్పుడు వ్యవసాయం దండగన్న చంద్రబాబు నేడు తెలంగాణలో సాగు పండగలా మారిందని చెప్పారు. రైతుల విషయంలో రాష్ట్రసర్కారు అవలంబిస్తున్న విధానాలను ప్రశంసించారు. కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని, రైతులపై ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్న ప్రభుత్వమే అలాంటి నిర్ణయాలు తీసుకొంటుందని బాబు కితాబిచ్చారు. తెలంగాణలో వ్యవసాయం, భూముల ధరలను ఏపీతో పోల్చి చూపుతూ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని వివరించారు..

బీఆర్ఎస్ పాలనలో రైతులు ఎంతో బాగుపడ్డారని, భూముల రేట్లు కూడా బాగా పెరిగాయని అభిప్రాయపడ్డారు. కేంద్రం ఒత్తిడి తెస్తున్నా కేసీఆర్ మాత్రం రైతులపక్షాన నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ సర్కారు తెగ పొగిడేశారు..తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయాన్ని, రైతులను ప్రేమిస్తోందని, రాష్ట్రం అన్నిరంగాల్లోనూ ఎంతో అభివృద్ధి సాధించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏ రాష్ట్రంలో అయితే అభివృద్ధి జరుగుతుందో అక్కడ భూముల విలువ పెరుగుతుందని అందుకు తెలంగాణే ఉదాహరణ అని చెప్పారు. సాగునీరు అందుబాటులో ఉంటే సాగు విస్తీర్ణంతో పాటు భూమి విలువ కూడా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. పరిశ్రమలు, రోడ్లు వస్తే వాటి విలువ మరింత పెరుగుతుందన్న ఆయన.. రైతులు వ్యవసాయంలో నష్టపోయినా.. భూమిని అమ్ముకొని కష్టాల నుంచి గట్టెక్కుతారని చెప్పారు.