హైదరాబాద్ లోని పాత బస్తీలో పోలీసులు అలర్ట్…!!!

హైదరాబాద్ లోని పాత బస్తీలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కేసు తీర్పు నేపథ్యంలో అదనపు భద్రత ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం తర్వాత కోర్టు తీర్పు వెల్లడించనుంది. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు బలగాలు మోహరించాయి. నాలుగు ప్లాటూన్ల ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలను సీనియర్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు…