భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో టెన్ష‌న్…

భార‌త్‌లో ఒమిక్రాన్ కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో టెన్ష‌న్ పెరిగిపోయింది. ఐదు రోజుల క్రితం క‌ర్ణాట‌క‌లో మూడు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. ఆ త‌రువాత దేశంలోని చాలా రాష్ట్రాల్లో వ‌ర‌స‌గా కేసులు మొద‌ల‌య్యాయి. ప్ర‌స్తుతం దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 87 కి చేరింది. ఈరోజు తెలంగాణ‌లో నాలుగు కేసులు న‌మోద‌వ్వ‌గా, క‌ర్ణాట‌క‌లో 5 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. దేశంలోని కర్ణాకటలో 8, తెలంగాణలో 7, ఢిల్లీలో 10, మహారాష్ట్ర 32, రాజస్థాన్‌ 17, కేరళ 5 , గుజరాత్‌ 5, ఏపీ, తమిళనాడు, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఒక్కొక్క కేసు నమోదైంది. ప్ర‌పంచ దేశాల్లో ఒమిక్రాన్ కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా బ్రిట‌న్‌లో క‌రోనా, ఒమిక్రాన్ విల‌య‌తాండవం చేస్తున్న‌ది. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే ఒమిక్రాన్ కేసులు రెట్టింప‌య్యాయి. లండ‌న్, మాంచెస్ట‌ర్‌ల్ పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. యూర‌ప్‌లోని ఇత‌ర దేశాల్లో సైతం క‌రోనా వ‌ణుకుపుట్టిస్తోంది. ప్ర‌పంచం మొత్తంమీద ఇప్ప‌టి వ‌ర‌కు 22 వేల‌కు పైగా ఒమిక్రాన్ కేసులు న‌మోదైన‌ట్టు స‌మాచారం.