భారతదేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది..

R9TELUGUNEWS.COM: భారతదేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం నాడు కొత్తగా ఏడు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకూ నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరింది. మహారాష్ట్రలో ఒక్కరోజే 7 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు..వీటిలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 3 కేసులు నమోదవగా, పింప్రి ప్రాంతంలో నాలుగు కేసులు వెలుగు చూశాయి. దేశవ్యాప్తంగా మొత్తం ఐదు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవగా.. ఒక్క మహారాష్ట్రలోనే 17 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. మిగిలినవాటిలో రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి నమోదయ్యాయి.