దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ దాటింది…

దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి పెరగింది. మొత్తం 11 రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 101 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు…మహారాష్ట్రలో 32, ఢిల్లీలో 22, రాజస్థాన్‌లో 17, కర్ణాటకలో 8, తెలంగాణలో 8, గుజరాత్‌లో 5, కేరళలో 5 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌, చండీగఢ్‌, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఒక్కో కేసు చొప్పున నిర్ధారణ అయినట్లు ఆయన చెప్పారు…గత 20 రోజులుగా 10 వేల కంటే తక్కువ కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయన్న ఆయన.. అందులో కేరళ నుంచే 40 శాతం కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ప్రపంచ దేశాలకంటే ఇండియాలోనే వేగంగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కొనసాగుతుందన్నారు..