సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్‌ బాధితుడి తల్లి, భార్యకు కొవిడ్‌ పాజిటివ్‌..

R9TELUGUNEWS.COM సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌మండలం గూడెం గ్రామంలో ఇటీవల దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. దీంతో అతన్ని హైదరాబాద్‌ టిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాజాగా అతని భార్య, తల్లికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని వైద్యాధికారి సంజీవరెడ్డి బుధవారం తెలిపారు. అయితే, వారిలో ఒమిక్రాన్‌ లక్షణాలు లేవని వెల్లడించారు. వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపనున్నట్టు చెప్పారు. గ్రామాన్ని సందర్శించి బాధితులకు మనోధైర్యం కల్పించినట్టు వైద్యాధికారి సంజీవరెడ్డి తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 25 ఒమిక్రాన్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే.