ఓమిక్రాన్‌ అంటే… ఏమిటి…ఎలా సోకుతుందో..లక్షణాలు ఏంటి.. ఎవరికి ఇబ్బంది..??

ఓమిక్రాన్‌ అంటే… ఏమిటి ? దీని లక్షణాలు ఏంటి ? ఎలా సోకుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

R9TELUGUNEWS.COM.
*** ఇది కొత్త కరోనా రకం . ఇది మన దేశం లో రెండో వేవ్ { మార్చ్ – మే 2021 } కి కారణం అయిన డెల్టా వైరస్ కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం గా విస్తరిస్తుంది . డెల్టా మార్చ్ లో మన దేశం తో మొదలై అక్టోబర్ నాటికి ప్రపంచం లోని అన్ని దేశాలను చుట్టేసింది . డెల్టా కంటే ఆరు రెట్లు ఎక్కువ వేగం అంటే ఓమిక్రాన్ ను నిలువరించడం అసాధ్యం . కట్టడి చర్యలు అనేది వినడానికి బాగుంటాయి . వాస్తవంగా, అందునా జనాభా ఎక్కువ ఉన్న భారత దేశం లో అసాధ్యం .

***ఓమిక్రాన్ దక్షిణాఫ్రికా దేశం లో ముందుగా గుర్తించారు . ఆస్ట్రేలియా , ఇటలీ , జర్మనీ , నెథర్లాండ్ , బ్రిటన్ , ఇజ్రాయెల్, హాంగ్ కాంగ్ , బోట్స్వానా , బెల్జియం దేశాల్లో ఇది ఇప్పటికే వుంది .

***ఓమిక్రాన్ సోకిన వారు కనబరిచే లక్షణాలు**: 1 బాగా అలసట గా ఉండడం , కొద్ది పాటి కండరాల నొప్పి , గొంతులో కొద్ది పాటి గరగర , పొడి దగ్గు . తక్కువ మందిలో కొద్ది పాటి జ్వరం . చికెన్ గున్యా కు దీనికి చాలా మాటకు ఒకటే లక్షణాలు .

4 . ఎవరికి సోకుతుంది ?
మొదటి వేవ్ లో కరోనా బారిన పడిన వారికి సోకవచ్చు . వారి ఇమ్మ్యూనిటి బాగా దెబ్బ తినే ఉంటే తప్పించి వారి పై దీని ప్రభావము అత్యంత స్వల్పం . అసలు వచ్చినట్టే తెలియదు . ఇప్పటిదాకా కరోనా సోకకుండా , వాక్సిన్ రెండు డోసులు తీసుకొన్న వారికి సోక వచ్చు . రెండు రోజులు అలసట , పొడి దగ్గు , 101 డిగ్రీలు దాటని జ్వరం తో ఇది పోతుంది . ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం ఉండదు . రెండో వేవ్ లో డెల్టా సోకిన వారికి ఇది సోకే అవకాశం బాగా తక్కువ . సోకినా వారికే అర్థం కాకుండా అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా పోతుంది . ఇప్పటిదాకా కరోనా బారిన పడకుండా అంతే కాకుండా వాక్సిన్ వేసుకోకుండా ఉన్న వారికి ఇది సోకుతుంది . వారి ఇమ్మ్యూనిటి బాగుంటే కోలుకొంటారు .

భయమే వారి పాలిట శాపం వారికే ఇబ్బంది….!!
భయపడే వార్తలను పదేపదే చదివే వారికి, వినేవారికి డేంజర్.. . వారి భయమే వారి పాలిట శాపంగా మారుతుంది . ఓమిక్రాన్ చంపదు. భయం ముంచేస్తుంది . ముందుగా ఆల్ఫా వైరస్ వచ్చింది . అటుపై దాని కంటే అనేక రెట్ల వేగం తో విస్తరించే డెల్టా వచ్చింది . ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేగంతో ఓమిక్రాన్ . కట్టడి చర్యల పేరుతొ