ఒమిక్రాన్ భ‌యంతో భార్యాపిల్ల‌ల‌ను చంపేసిన డాక్ట‌ర్‌.

R9TELUGUNEWS.COM..
ఇప్ప‌టికే ఎంతోమందిని పొట్ట‌న‌బెట్టుకుంది. ఇవ‌న్నీ క‌ళ్లారా చూసిన ఓ డాక్ట‌ర్ మాన‌సికంగా ఎంత‌గానో కుంగిపోయాడు. పైగా ఇదే స‌మ‌యంలో ఒమిక్రాన్ వ్యాప్తి మొద‌లు కావ‌డంతో ఈ వేరియంట్ ఎవ‌ర్నీ వ‌ద‌ల‌ద‌ని.. అంద‌ర్నీ చంపేస్తుంద‌ని ఆవేద‌న చెందాడు. ఆ భ‌యంతో మ‌రింత డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాడు. ఒమిక్రాన్ నుంచి ఎలాగైనా త‌న కుటుంబానికి విముక్తి క‌ల్పించాల‌ని భావించి భార్యాపిల్ల‌ల‌ను చంపేశాడు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది..కాన్పూర్‌కు చెందిన డాక్ట‌ర్ సుశీల్ సింగ్ (55).. భార్య చంద్ర‌ప్ర‌భ (50), కుమారుడు శిఖ‌ర్ సింగ్ (21) కుమార్తె ఖుషీ సింగ్ (16) క‌ళ్యాణ్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. కాన్పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో ఫొరెన్సిక్ విభాగాధిప‌తిగా ప‌నిచేస్తున్నాడు. ఆస్ప‌త్రితో రోజూ క‌రోనా కేసులు చూసి చూసి కొంత‌కాలంగా డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోయాడు. ఈ క్ర‌మంలో కొత్త‌గా ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తుండ‌టంతో మ‌రింత భ‌య‌ప‌డిపోయాడు. ఒమిక్రాన్ వేరియంట్ అంద‌ర్నీ చంపేస్తుంద‌ని ఫిక్స‌య్యాడు. త‌న నిర్ల‌క్ష్యం కార‌ణంగా ఏదో ఓ రోజు తాను దాని బారినప‌డ‌క త‌ప్ప‌ద‌ని.. దాని నుంచి త‌ప్పించుకోవ‌డం అసాధ్య‌మ‌ని భావించాడు. ఇలా పిచ్చి పిచ్చి ఆలోచ‌న‌ల‌తో మరింత కుంగిపోయిన సుశీల్‌.. భార్యాపిల్ల‌లు ముగ్గుర్నీ దారుణంగా చంపేశాడు. అనంత‌రం ఈ విష‌యాన్ని పోలీసుల‌కు చెప్ప‌మ‌ని త‌న సోద‌రుడు సునీల్ సింగ్‌కు ఫోన్ చేసి చెప్పి అక్క‌డి నుంచి పారిపోయాడు.భ‌య‌ప‌డిపోయిన సునీల్ సింగ్‌.. సుశీల్ ఫ్లాట్‌కి వ‌చ్చి చూడ‌గా ర‌క్త‌పు మడుగుల్లో వ‌దిన‌, పిల్ల‌లు క‌నిపించారు. సునీల్ స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నాస్థలికి చేరుకున్న పోలీసులు ఇంట్లో ర‌క్తపు మ‌ర‌క‌లు అంటిన‌ ఒక సుత్తెను గుర్తించారు. అలాగే ఒక డైరీని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఒమిక్రాన్ అంద‌ర్నీ చంపేస్తుంది.. అందుకే దానికంటే ముందు నా భార్యాపిల్ల‌ల‌కు విముక్తి క‌ల్పిస్తున్నా అని రాసి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. గ‌తంలో కూడా డిప్రెష‌న్‌లో వ‌దిన చంద్ర‌ప్ర‌భ‌ను చంపేందుకు సుశీల్ ప్ర‌య‌త్నించాడ‌ని సునీల్ సింగ్ పోలీసుల‌కు తెలిపారు. ఈ మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప‌రారీలో ఉన్న సుశీల్ సింగ్ కోసం మూడు బృందాలు వెతుకుతున్నాయ‌ని పోలీస్‌ క‌మిష‌న‌ర్ ఆసిమ్ అరుణ్ తెలిపారు…