ఇవాళ ఒక్కరోజే 16 ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వడం కలవరం..

R9TELUGUNEWS.COM.. భారత్‌లో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 16 ఒమిక్రాన్‌ కేసులు నమోదవ్వడం కలవరం పెడుతోంది. దీంతో భారత్‌లో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 21కి పెరిగింది. తాజాగా రాజస్థాన్‌లోని జయపురలో 9 ఒమిక్రాన్‌ కేసులను గుర్తించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 9 మంది కుటుంబసభ్యులకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో 8, కర్ణాటకలో 2, గుజరాత్‌లో 1, దిల్లీలో 1 కేసు నమోదైన విషయం తెలిసిందే..