గాలి ద్వారా ఒమిక్రాన్ సోకె ప్రమాదం : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ..

హైదరాబాద్‌..
R9TELUGUNEWS.COM.
తెలంగాణలోనూ ఒమిక్రాన్‌ కలవరం మొదలైంది.

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ కరోనా కొత్త వేరియంట్‌ కేసులను హైదరాబాద్‌లో గుర్తించినట్లు రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ నెల 12న కెన్యా, సోమాలియా నుంచి హైదరాబాద్‌ (టోలిచౌకీ)కి వచ్చిన ఇద్దరి (24 ఏళ్ల మహిళ, 23 ఏళ్ల వ్యక్తి)లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ ఇద్దరిని కూడా *టిమ్స్‌కు* తరలించినట్లు తెలిపారు.
మరోవైపు హైదరాబాద్‌ నుంచి బెంగాల్‌కు వెళ్లిన ఓ కుటుంబంలోని ఏడేళ్ల బాలుడిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు తెలిపారు.
ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు…